అట్టహాసంగా..


Tue,June 25, 2019 02:48 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఇందూరు టీఆర్‌ఎస్‌లో సంబురాలు మిన్నంటా యి. పండుగ వాతావరణం నెలకొన్నది. నగరం లో పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి కీలక అ డుగు పడడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందంతో సంబురాలు చేసుకున్నారు. రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, రవాణా, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌రావు, ఆకుల లలిత, మేయర్ ఆకుల సుజాత తదితర నాయకులతో కలిసి ఆయ న భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించారు. మంత్రి, ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి మంత్రికి శాలువ కప్పి ఈ కార్యక్రమానికి స్వాగతించారు.

తెలంగాణకు రక్షణ కవచం టీఆర్‌ఎస్ : మంత్రి వేముల
తెలంగాణ రాష్ర్టానికి టీఆర్‌ఎస్ ఒక రక్షణ కవచంలా ఉండాలని, దేశ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ పటిష్టంగా ఉండాలని, రాష్ట్రంలో ఉన్న ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్త తెలంగాణ రాష్ర్టానికి ఒక రక్షణ కవచంలా తయారు కావాలనే ఉద్దేశంతో అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్ కార్యాలయాలకు శంకుస్థాపన చేశామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, రవాణా, హౌసిం గ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో సోమవారం టీఆర్‌ఎస్ నూతన కా ర్యాలయ భవన నిర్మాణానికి ఆయన భూమి పూ జ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. టీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీఎం కే సీఆర్ ఆలోచనల మేరకు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నామన్నారు. మరో వంద సంవత్సరాలు టీఆర్‌ఎస్ పార్టీ, పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజల బాగోగుల కోసం, సౌలభ్యం కోసం, తెలంగాణ ప్రజలకు రక్షణగా నిలవాలని ఆకాంక్షించారు. ఆ స్ఫూర్తితో టీఆర్‌ఎస్ కార్యకర్తలు శిక్షణ పొందాలన్నారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలను నిర్మించుకొని సంక్షేమం, అభివృద్ధిపైనా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించుకుంటామని తెలిపారు. అంతిమంగా బంగారు తెలంగాణగా మారే సందర్భంలో ప్రతి కార్యకర్త చురుకైన పాత్ర పోషించాలనే ఉద్దేశంతో పార్టీ పటిష్టానికి తీసుకున్న నిర్ణయమని మంత్రి అన్నారు. జిల్లాలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అభిప్రాయం మేరకు ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో పార్టీ నిర్మాణానికి స్థలం సేకరించామన్నారు. ప్రభుత్వం పార్టీల జిల్లా కార్యాలయాలకు ఒక ఎకరం స్థలం కేటాయించాలనే చట్టం ఉందని గుర్తు చేశారు. ఈ చట్టం ప్రకారం టీఆర్‌ఎస్ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించిందని అన్నారు. ఇది రాజకీయాలు కోసం కాదని, తెలంగాణ ప్రజల బాగు కోసమన్నారు.

కాళేశ్వరం నిర్మాణాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి
తెలంగాణ ప్రజలకు రక్షణ గా ఉండాలని చెప్పి ప్రాజెక్టుల ను నిర్మించుకుంటున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ పూర్తి చే శారని మంత్రి వేముల గుర్తు చేశారు. దాన్ని కూడా రాజకీయ కోణంలో కొన్ని పార్టీ లు చిత్ర విచిత్రమైన విమర్శలు చేస్తున్నాయని ప్రతిపక్షాలపై ఆయన ధ్వజమెత్తారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని కొంత మంది రా జకీయ పార్టీల వారు జీర్ణించుకోలేకపోతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు పథకానికి కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసులు వేసి పనులను ఆపే పనిచేసిందని విమర్శించారు. అయినా సరే సీఎం కేసీఆర్ నిబద్ధత, పట్టుదల ముందు వారి కుట్రలు ఫలించలేదన్నారు. అన్నింటికీ అనుమతులు తీసుకువచ్చామని, అన్ని అనుమతులు వచ్చిన తర్వాత కా ళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు స్టార్ట్ అయ్యాయని.. నీళ్లు వచ్చాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకపడ్తున్న ప్రతిపక్షాలను తిప్పికొట్టడానికి తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉండాల్సిన అవస రం ఉన్నదన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంటే కూడా వారు చూడలేక వాటిని ఆపే ప్ర యత్నం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలకు రక్షణ గా ఉండాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ కార్యాలయాలను నిర్మించుకుంటున్నామన్నారు. వచ్చే దసరా పండుగ రోజున ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకుంటామని తెలిపారు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు నిజామాబాద్ జిల్లా పార్టీ పక్షాన, తన పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావులకు హృదయ పూర్వక ధన్యవాదలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి నాంపల్లి నడిబొడ్డున గత ప్రభుత్వం స్థలం కేటాయించిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గుర్తు చేశారు. నాంపల్లిలో కట్టుకున్న పార్టీ కార్యాలయ భూమి కూడా ప్రభుత్వానిదేనని జిల్లా బీజేపీ నాయకులకు చురకలంటించారు. ఆ భూమి కూడా కోట్ల విలువ చేసే భూమి అని అన్నారు. పార్టీలు ప్రజల కోసం పనిచేయాలని, రాజకీయాల కోసం కాదని మంత్రి హితవు పలికారు. టీఆర్‌ఎస్ పార్టీ, పార్టీ కార్యకర్తలు కూడా ప్రజల కోసం పనిచేస్తారని తెలిపారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...