అధికారులు అప్రమత్తంగా ఉండాలి


Tue,June 25, 2019 02:47 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున రైతులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండే లా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉంటాయో క్షేత్రస్థాయి అధికారులతో రోజు వారీగా సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవిందును ఆదేశించారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, నగరపాలక సంస్థల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వరదలతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని , కురిసిన వర్షపు నీరు నిలువకుండా డ్రైనేజీ క్లీన్ చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. చెరువులు, కుంటలు, కాలువలు బలహీనంగా ఉన్న చోట వర్షాలు పడినప్పుడు తెగిపోకుండా ముందస్తుగా పరిశీలన చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు తమ విన్నపాలను పరిశీలించి తక్షణమే పరిష్కారం చేయాలని ఆదేశించారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆయా విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు కూడా వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని, విద్యాసంస్థ భవనాల ఆవరణలో నీరు నిలువ లేకుండా, బలహీనమైన భవనాలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం లాంఛన ప్రారంభోత్సవ తేదీ గుర్తించే ముందే జిల్లాలో లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల పింఛన్ వెంటనే మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులను పరిష్కారానికి ఈ నెల 26వ తేదీన ప్రగతిభవన్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్, ఫారెస్టు, వైద్య, ఆరోగ్యశాఖ, విద్యాశాఖల్లో పెండింగ్ కేసులు ఎక్కువగా ఉన్నందున సమావేశంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో అంజయ్య, డీఆర్డీవో రమేశ్ రాథోడ్, జడ్పీ సీఈవో వేణు ఆయా శాఖల జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...