బాలలను ప్రగతికారులుగా తీర్చిదిద్దాలి


Tue,June 25, 2019 02:47 AM

నిజామాబాద్ లీగల్ : బాలలను భవిష్యత్ సమాజంలో ప్రగతికారులుగా చేయాలని, మంచిని ప్రేమించి, చెడును ద్వేషించి చట్టం ప్రకారం నడుచుకునేలా తీర్చిదిద్దాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్‌పర్సన్ శ్రీసుధ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని సంస్థ కార్యాలయం, న్యాయసేవా సదన్‌లో పోలీసు అధికారులకు జువైనల్ చట్టంపై సోమవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. బాలల ప్రవర్తనను, వారి చదువును నిరంతరం పరిశీలన చేయాలని, తల్లిదండ్రులు విద్యావంతులు కావాలని సూచించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం ఉండాలని, విద్యార్థులు భవిష్యత్ గూర్చి నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టుకునేలా వారిని తీర్చిదిద్దాలని ఆమె పేర్కొన్నారు. బాలలపై జరుగుతున్న ఆకృత్యాలను విచారించే సందర్భంలో పోలీసు అధికారులు చట్టం నిర్దేశించిన విధంగా విచారణ చేయాలని అన్నారు. సంస్థ కార్యదర్శి , సీనియర్ సివిల్ జడ్జి కిరణ్మయి మాట్లాడుతూ పోలీసు అధికారులు భవిష్యత్ విచారణకు బాలల సంరక్షణ, పోషణ చట్టం నిరంతరం అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి కళార్చన, న్యాయవాదులు రాజ్‌కుమార్ సుబేదార్, అంకిత, రమాదేవి, మానిక్‌రాజ్, డాక్టర్ కేశవులు, ఉషానవీన్, విశాల్ పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...