అయ్యో..అంజన్నా!


Sun,June 23, 2019 02:35 AM

నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ నగరానికి కొద్ది దూరంలో ఉన్న చారిత్రక సారంగపూర్ హనుమాన్ ఆలయంలో దోపిడీ దొంగలు బీ భత్సం సృష్టించారు. శుక్రవారం అర్ధరాత్రి అ నంతరం ఆలయ గేటు ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన దుండగులు, వాచ్‌మన్‌పై దాడిచేసి అతన్ని బంధించి దోపిడీకి పాల్పడ్డారు. ముఖానికి ముసుగులు ధరించి వచ్చి దోపిడీకి పాల్పడినట్లు వాచ్‌మన్ పోలీసులకు తెలిపాడు. నిజామాబాద్ ఆరో టౌన్ పోలీస్ స్టేష న్ పరిధిలోని సారంగపూర్ గ్రామ శివారులో ఎత్తైన ప్రదేశంలో కొలువైన పురాతన హనుమాన్ ఆలయంలో చోరీ జరిగింది. శుక్రవా రం అర్ధరాత్రి 12గంటల వరకు ఆలయ పూ జారి గుడిలో ఉండి, అనంతరం గుడికి తాళం వేసి కింది భాగంలో ఉన్న తన నివాసానికి వె ళ్లాడు. ఆలయంలో అర్సపల్లికి చెందిన శ్యాం సుందర్ అనే వ్యక్తి వాచ్‌మన్‌గా పనిచేస్తున్నా డు. ఆయన ప్రతిరోజూ రాత్రి ఆలయ ప్రాం గణంలోనే నిద్రిస్తుంటాడు. నిత్యం మాదిరిగానే రాత్రి ఒంటి గంట సమయంలో వాచ్‌మన్ నిద్రకు ఉపక్రమించాడు. ముఖాలకు ముసుగులు ధరించి వచ్చిన ముగ్గురు వ్యక్తు లు ఆలయం గేటు వద్దకు వచ్చి ఇనుపరాడ్డు తో గేటు తాళం ధ్వంసం చేసేందుకు ప్రయ త్నం చేశారు. వాచ్‌మన్ మేల్కొని ఎవరూ అంటూ గట్టిగా అరిచాడు. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసి 100 నంబర్‌కు డయల్ చేసేందుకు ప్రయత్నించాడు.ఇంతలో గేటు తాళం ధ్వం సం చేసిన దుండగులు లోనికి ప్రవేశించారు. వచ్చీ రాగానే కర్రతో వాచ్‌మెన్ రెండు కాళ్లపై గట్టిగా కొట్టారు. దీంతో అతడు కింది నుంచి పైకి లేవలేక పోయాడు. వెంటనే పక్కనే ఉన్న లుంగీని చించి దుండగులు దానితో వాచ్‌మె న్ రెండు చేతులను వెనక్కి కట్టివేశారు. రెండు కాళ్లను ఆలయం గేటుకు కట్టివేశారు. అనంతరం హుండీ తాళం ధ్వంసం చేసి అందులో ని డబ్బులు దోచుకున్నారు.

హుండీలోని చిల్లరను అక్కడే వదిలేశారు. ఆలయ గర్భగుడి తాళం ధ్వంసం చేసి లోపల పూజారులకు సంబంధించిన నాలుగు పెట్టెలను సైతం బద్దలుకొట్టారు. అందులోని డబ్బులు కూడా దోచుకుపోయారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో పూజారి సతీశ్ మహరాజ్ ఆలయం తెరిచేందుకు వచ్చే సరికి వాచ్‌మన్ శ్యాంసుందర్ బంధించ బడి ఉండడా న్ని గమనించిన ఆయన వెంటనే ఇతర పూ జారులు, పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వాచ్‌మన్‌ను చికిత్స నిమి త్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, సీసీఎస్ ఏసీపీ స్వామి, సౌత్, నార్త్ రూరల్ సీఐ లు రఘునాథ్, శ్రీనాథ్‌రెడ్డి, ఆరో టౌన్ ఎస్సై లక్ష్యయ్య సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. డాగ్‌స్కాడ్, క్లూస్ టీమ్‌ను సైతం సంఘటనా స్థలానికి తీసుకువచ్చి ఆధారాలు సేకరించారు. ఆలయ హుండీ 16 నెలలుగా తెరవలేదని ఆలయ పూజారీ పోలీసులకు తెలిపారు. అందులో సుమారు రూ.15 లక్షల వరకు నగదు, కానుకలు ఉండి ఉంటాయని ఆయన పేర్కొన్నారు.ఈ దోపిడీ ఘటనపై ఆలయ పూజారీ సతీశ్ మహరాజ్ ఫిర్యాదు మేరకు ఆరో టౌన్ ఎస్సై లక్ష్మయ్య కేసు నమోదు చేసుకున్నారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో దోపి డీ ముఠా ఆనవాళ్లు గుర్తించడం పోలీసులకు కష్ట్టసాధ్యంగా మారింది. ముఠా సభ్యులు తెలుగు భాషలోనే మాట్లాడిన్నట్లుగా వాచ్‌మన్ పోలీస్‌లకు తెలిపాడు. వాచ్‌మెన్ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను దొంగలు ఎత్తుకుపోయారని తెలిసింది.

167
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles