ఇందూరులో పట్టపగలు దారుణం


Sun,June 23, 2019 02:34 AM

నిజామాబాద్ క్రైం: నిజామాబాద్‌లో పట్టపగలు దారుణం చోటుచేసుకున్నది. ఇంటి ఎదుట సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. నిలబడి ఉన్న ఓ యువకుడి గొంతుపై బ్ల్లేడుతో దాడిచేసి గాయపరిచారు. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్‌కల్ రోడ్డులో ఉన్న రేడియో స్టేషన్ ఎదుట కాలనీలో మనోజ్ అనే యువకుడు నివాసముంటున్నాడు. ఆ యువకుడు హైదరాబాద్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చిన మనోజ్, శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన ఇంటి ఎదుట గేటు వద్ద నిలబడి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో బ్లూ కలర్ ఎఫ్‌జెడ్ బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకుల్లో ఒకరు మనోజ్ ఇంటి వద్దకు వచ్చి ఇక్కడ ఫంక్షన్‌హాల్ ఎక్కడ ఉందని మనోజ్‌ను అడిగారు. దీంతో ఆ యువకుడు అటువైపు ఉందని చేతెత్తి చూపించాడు. ఇంతలో మరో వ్యక్తి తన చేతిలో ఉన్న బ్ల్లేడ్‌తో మనోజ్ గొంతుపై దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో మనోజ్ గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు అతడిని దవాఖానకు తరలించారు. నిజామాబాద్ నాలుగో టౌన్ ఎస్సై నరేందర్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. దాడి చేయడానికి కారణాలు, ఎవరితో అయినా విభేదాలు ఉన్నాయా అని బాధితుడు మనోజ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎస్సై వెంట సిబ్బంది, స్థానికులు ఉన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...