ఇందూరులో తెలంగాణ భవన్


Sun,June 23, 2019 02:34 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు అన్ని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల సొంత భవనాలు నిర్మాణం కాబోతున్నాయి. ఈ మేరకు సేకరించిన స్థలాల్లో ఒకేరోజు భూమి పూజ చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 24న సోమవారం ఉదయం 9గంటలకు టీఆర్‌ఎస్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నేతృత్వంలో స్థల సేకరణ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు ఎమ్మెల్యే ఈ స్థలాన్ని పరిశీలించారు. 3,800 గజాల స్థలంలో భవన నిర్మాణానికి సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేకు ఇవ్వడంతో ఆయన దగ్గరుండి పనులను పరిశీలిస్తున్నారు. 24న రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, రవాణా, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ స్థలానికి భూమి పూజ చేయనున్నారు. ఉదయం 9గంటలకు మంచి ముహూర్తం ఉండడంతో సరిగ్గా అదే సమయానికి భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాకేంద్రం నడిబొడ్డున పార్టీ సొంత భవనాన్ని నిర్మిస్తున్న తరుణంలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనబడుతున్నది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...