మిన్నంటిన కాళేశ్వరం సంబురాలు


Sat,June 22, 2019 02:54 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో సబ్బండ వర్ణాల సంబురాలు మిన్నంటాయి. టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు సైతం సంబురాల్లో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సస్యశ్యామలం చేయనున్న కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కృషితోనే అతి తక్కువ కాలంలో కల సాకారమైందని అభిప్రాయపడ్డారు. జిల్లాలో శుక్రవారం పండుగ వాతావరణం కనిపించింది. బోనాలు, డప్పు వాయిద్యాలు, నృత్యాలు, పటాకుల మోతాలతో అంగరంగ వైభవంగా టీఆర్‌ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించుకున్నారు.

నిజామాబాద్ నగరంలో ...
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలో సంబురాలు అంబరాన్నంటాయి. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కలెక్టరేట్ ఆవరణలో టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. మెప్మా సిబ్బంది మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, ధర్నాచౌక్‌లో ముగ్గులు వేశారు. కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ కేక్‌కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు స్వీట్లు పంచుకున్నారు. ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. పటాకులు కాల్చి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర మేయర్ ఆకుల సుజాత, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఏఎస్ పోశెట్టి, టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, నీటి పారుదల సిబ్బంది పాల్గొన్నారు.

బాల్కొండ నియోజకవర్గంలో...
నియోజకవర్గంలో అన్ని మండలాలు, గ్రామాల్లో కాళేశ్వరం సంబురాలు నిర్వహించుకున్నారు, టీఆర్‌ఎస్ శ్రేణులు మండల కేంద్రాల్లో, గ్రామాల్లో పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మండల కేంద్రాల్లో ఐకేపీ యూనియన్ ఆధ్వర్యంలో, మండల సమైక్యాలు, గ్రామ సమైక్యాల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. మండల కేంద్రాల్లో వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతులు స్వీట్లు పంపిణీ చేశారు. పలుచోట్ల టీఆర్‌ఎస్ శ్రేణులు ఆలయాల్లో పూజలు నిర్వహించారు.

ఆర్మూరు నియోజకవర్గంలో...
ఆర్మూర్‌లోని మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలోని టీఆర్‌ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, రైతులు పటాకులు కాల్చి సంబరాలు నిర్వహించారు. డొంకేశ్వర్‌తో పాటు అన్ని గ్రామాల్లో నాయకులు సంబురాలు నిర్వహించారు. నందిపేట్‌లోని ప్రధాన కూడళి నంది విగ్రహం వద్ద టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నక్కల భూమేశ్, సర్పంచులు, సీనియర్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. మాక్లూర్ మండలంలోని మానిక్‌బండార్‌లో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఆకుల రజినీశ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ మాస ప్రభాకర్, సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.

బోధన్ డివిజన్‌లో...
బోధన్ డివిజన్‌లోని వివిధ మండలాల్లో, రైతులు, టీఆర్‌ఎస్ శ్రేణులు, అధికారులు సంబురాలు చేసుకున్నారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్‌ఎస్ నాయకులు, రైతుల ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు వీఆర్ దేశాయ్, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. బోధన్ మున్సిపల్, మెప్మా ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. మహిళా సమైక్యాల సభ్యులు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ముగ్గుల పోటీ నిర్వహించారు. కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ చైర్మన్ అనంపల్లి ఎల్లయ్య, మున్సిపల్ కమిషనర్ స్వామినాయక్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. బోధన్ మండలంలోని అన్ని గ్రామాల్లోనూ కాళేశ్వరం సంబురాలు జరిగాయి. సాలూర గ్రామంలో బోధన్ ఎంపీపీ చైర్మన్ బుద్దె సావిత్రి రాజేశ్వర్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కల్దుర్కి, పెగడపల్లి, జాడీ జమాల్‌పూర్ గ్రామాల్లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎడపల్లిలో టీఆర్‌ఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో వేర్వేరుగా కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్‌పర్సన్ రజితయాదవ్ పాల్గొన్నారు. డివిజన్‌లోని రెంజల్, వర్ని, చందూర్, మోస్రా, రుద్రూర్ మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కోటగిరి, నవీపేట్ మండలాల్లో సంబురాలు జరిగాయి.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో...
రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపు మేరకు ఏడు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు సంబురాలను అంబరాన్నంటేలా నిర్వహించారు. టీయూలో కేసీఆర్ చిత్రపటానికి రిజిస్ట్రార్ బలరాములు పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచిపెట్టారు. మండల కేంద్రంలోని తల్లితెలంగాణ విగ్రహం ఎదుట ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్మోహన్, ఎంపీపీ గద్దెభూమన్న, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు.

ఇందల్వాయి మండలంలో ఎంపీపీ రమేశ్ నాయక్, జడ్పీటీసీ సుమనారెడ్డి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ధర్పల్లిలో ఎంపీపీ నల్ల సరిత, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో ఎంపీపీ బోయిడి మంజుల, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోటరాజన్న ఆధ్వర్యంలో సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహింరు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో ఎంపీపీ, జడ్పీటీసీ, పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ మండలంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ముస్కె సంతోష్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మోపాల్ మండల కేంద్రంలో కాళేశ్వరం సంబురాలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...