కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు


Sat,June 22, 2019 02:52 AM

ఖలీల్‌వాడి: ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైనదని కలెక్టర్ రామ్మోహన్‌రావు అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలోని నీటి పారుదల శాఖ సర్కిల్ కార్యాల యం ఎదుట నిర్వహించిన సంబురాల్లో ఆయ న పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ కేక్‌కట్ చేసి అనంతరం మాట్లాడారు. సుమారు పదమూడు జిల్లాలోని 18.5 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించడానికి ఉద్దేశించిన ఈ పథకం అతి తక్కువ వ్యవధి మూడేండ్లలోనే పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. దీనికి అత్యంత సమర్థమైన పంపులను ఉపయోగించడం, 203 కి.మీ మేర సొరంగ మార్గాలు, 1531 కి.మీ కాలువల ఏర్పాటు చేసుకోవడం, అతి తక్కువ సమయంలో ఎన్నో అవాంతరాలను అధిగమించి అత్యంత శ్రమతో కూడుకున్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఇంజినీర్లు, కూలీలు, అధికారులు చేసిన కృషి ఎనలేనిదన్నారు. 19 పంపుహౌస్‌లను నిర్మించి మోటార్లు బిగించడం, ఇరవై బ్యారేజీలు నిర్మా ణం చేయడం మామూలు విషయం కాదన్నా రు. అంతకు ముం దు ప్రగతిభవన్ ఎదురు దుర్గామాత ఆలయం లో కలెక్టర్ పూజలు చేశారు. కార్యక్రమంలో డీఆర్వో అంజయ్య, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ మురళీధర్, డీఆర్డీవో రమేశ్ రాథోడ్, డీసీఎస్‌వో కృష్ణప్రసాద్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...