కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన


Fri,June 21, 2019 01:58 AM

నిజామాబాద్ క్రైం: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షలో అర్హులైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. అదనపు డీసీపీ శ్రీధర్ రెడ్డి సమక్షంలో జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్‌లో ధ్రువీకరణ పత్రాల పరీశీలన చేపట్టారు. ఆరో రోజైన గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. రాష్ట్ర పోలీస్ నియామక మండలి సూచనల మేరకు సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఆరో రోజు 420 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీసు ఉద్యోగాలు ఇపిస్తామని దళారులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్రోకర్ల సమాచారం అందించడానికి పోలీస్ శాఖ 9490618000 సెల్ నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఎన్‌ఐబీ, సీసీఎస్, ఏసీపీలు రాజారత్నం, స్వామి, ఏవో సత్యకుమార్, శ్రీనివాస్, మక్సూద్ హైమద్, గోవింద్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, ఆర్‌ఐలు, ఐటీ కోర్ ఆర్.శివకుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...