కల్తీ కలవరం...


Fri,June 21, 2019 01:57 AM

జిల్లాలో వైన్స్ లాభాలు అంతంతా మాత్రంగా ఉండడంతో యజమానులు కల్తీ మద్యంపై దృష్టి పెట్టారు. నిజామాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో కల్తీ బీర్లు, విస్కీలను విక్రయిస్తున్నారు. అయితే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కల్తీ మద్యం అత్యధికంగానే విక్రయిస్తున్నారు. ఎక్కువ శాతం మద్యాన్ని నీటితో కల్తీ చేస్తున్నారు. మద్యం బాటిళ్ల మూతకు వేసిన సీల్ వేసినట్టుగానే ఉంటుంది.కానీ, మద్యం మాత్రం కల్తీ అవుతోంది. మద్యం బాటిళ్ల మూతలను ప్రత్యేక పరికరాలతో తీసేయడం, నీళ్లు కలిపాక పరికరాలతో మళ్లీ మూత పెట్టడం జరుగుతోంది. ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండెడ్ కంపెనీ మద్యం బాటిళ్లలో కల్తీ చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందంతా తెలియని మద్యం ప్రియులు రెండు రకాలుగా నష్టపోతున్నారు.

చాక్లెట్‌ల రూపంలో గంజాయి విక్రయం...
జిల్లాకేంద్రంలో చాక్లెట్‌ల రూపంలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యాపారిని అప్పట్లో పట్టుకొని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కానీ, మళ్లీ కొన్ని రోజుల తర్వాత గంజాయి స్మగ్లర్లు తిరిగి చాకెట్ల దందా మళ్లీ కొనసాగిస్తున్నా.. ఆ వైపు కన్నెతి చూడడం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖ అధికారులు చాక్లెట్ గంజాయి ఎక్కడ పట్టుకున్నట్లు కూడా వెల్లడించక పోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి స్మగ్లర్లు ఆకులను ముద్దలుగా చేసి చాకెట్లలా తయారుచేసి ఆకర్షణీయంగా ఉండే ప్యాకింగ్ చేస్తున్నారు. రవాణా చేసే సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించిన పెద్దగా పట్టుకునే అవకాశం ఉండడం లేదు. దీంతో ఇదే సులువైన మార్గం అన్ని ఎంచుకొని రోడ్డుపైన పాన్ షాప్‌లో ఉంచి యథేచ్ఛగా విక్రయిస్తున్నట్లు సమాచారం.

కల్లు దుకాణాలపై దాడులతో బెదిరింపు...
జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది కల్లు దుకాణాలపై దాడిచేసి కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు తరుచూ కొనసాగుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్సు అధికారులు గ్రామాల్లో ఉన్న కల్లు దుకాణాలను టార్గెట్ చేయ డం లక్ష్యంగా పెట్టుకొని ప్రతి రోజు తమ సిబ్బంది వాహనాల్లో బయలుదేరుతారు. డీజిల్ ఖర్చు కావాలని ప్రతి దుకాణాల్లో రూ.500 నుంచి రూ.1000 ఇలా వసూలు చేసుకొని సాయం త్రం స్వయంగా ఎక్సైజ్ శాఖ కార్యాయంలోనే నీకింత నాకింత అని మామూళ్లు పంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అడిగిన లంచం ఇస్తే కల్తీ కల్లు అమ్ముకోవడానికి పరోక్షంగా గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్న అధికారులు.. ఇవ్వని వారిపై కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...