నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలి


Thu,June 20, 2019 03:04 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈనెల 22న ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించాలని ఎంపీడీవోలకు కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలతో ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా, నీటి ఉపద్రవాలు సంభవించకుండా పీఎం నరేంద్రమోదీ సర్పంచులు, ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రతి గ్రామ పంచాయతీకి సర్పంచుల పేరుమీద లేఖలు పంపించారని, వాటిని సర్పంచులకు ఈనెల 20వ తేదీలోగా అందేలా చూసి 22న తేదీన ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించాలని ఆదేశించారు. రాబోయే కాలంలో నీటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలో, వర్షపు నీటిని సరంక్షణ ఏ విధంగా చేపట్టాలి , నీటిని పొదుపు చేసుకునే విధానంపై గ్రామసభల్లో చర్చించాలన్నారు. ప్రధానమంత్రి లేఖను గ్రామ సభల్లో ప్రజలకు చదివి వినిపించాలని పేర్కొన్నారు. నీటిని సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడుగుంత నిర్మాణం చేపట్టేలా చూడాలన్నా రు.

మ్యాజిక్ సోక్‌బిట్స్ మంజూరీకి అనుగుణంగా నిర్మాణా లు పూర్తి చేయాలన్నారు. వర్షాలు ప్రారం భం కాగానే హరితహా రం కార్యక్రమంలో మొక్కలు నాటడానికి అవసరమైన ఏర్పా ట్లు చేయాలని, ఆయా ప్రాంతాలను గుర్తించాలని, గుంతలు తవ్వించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది లక్ష్యాన్ని మించి మొక్కలు నాటి సంరక్షించడానికి ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. మొక్కలు నాటించడం కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చట్టబద్ధ బాధ్య త అని సర్పంచులకు తెలియజేయాలని తెలిపారు. జూలై వరకు తాగునీటి ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, వర్షాలు కురిసే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలన్నారు. సర్పంచులకు, ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చినందున, వారు నిబంధనలను పాటించేలా తెలియజేయాలన్నారు. వీసీలో డీఆర్డీవో రమేశ్, డీపీవో జయసుధ, గ్రౌండ్ వాటర్ డీడీ ప్రసాద్, ఏపీడీ వినయ్‌కుమార్ ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...