నలుగురు జిల్లావాసులకు పీహెచ్‌డీల ప్రదానం


Wed,June 19, 2019 02:08 AM

- ఆర్మూర్ వాసికి సోషల్ వర్క్ విభాగంలో...
ఓయూ సోషల్ వర్క్ విభాగంలో ఆర్మూర్ వాసి డాక్టర్ కర్ణం నరేశ్‌కుమార్ డాక్టరేట్‌ను అందుకున్నారు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వారి జీవిత సంతృప్తి అనే అంశంపై నరేశ్‌కుమార్ పరిశోధన చేశారు. డాక్టర్ నరేష్‌కుమార్ యూజీసీ- జెఆర్‌ఏఫ్ ద్వారా సోషల్ వర్క్ విభాగంలో మొట్ట మొదటి వ్యక్తిగా ఈ ఘనత సాధించారు. గల్ఫ్- వలసలు- సమస్యలు అనే అంశంపై జాతీయ, అంతర్జాతీయ పరిశోధన పత్రాలను సమర్పించారు. రచనలు సైతం చేశారు. సోషల్ వర్క్‌ర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వ్యవస్థాపక సభ్యుడిగా, తర్వాత ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా పీజీఆర్‌ఆర్‌సీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ చింత మహేశ్, డాక్టర్ హన్న ఆనంద్‌రాజ్, పలువురు అధ్యాపకులు నరేశ్‌కుమార్‌ను అభినందించారు.

వృక్షశాస్త్ర విభాగంలో ఆలూరు వాసికి...
ఆర్మూర్, నమస్తే తెలంగాణ : ఆర్మూర్ మండలంలోని ఆలూరుకు చెందిన అబ్బ వీరేంద్రబాబు పీహెచ్‌డీ పట్టాను పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ 80వ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్, ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం చేతుల మీదుగా మంగళవారం ఆయన పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు. వృక్షశాస్త్ర విభాగంలో జిల్లాలోని అలీసాగర్ చెరువులో శైవలాల వైవిధ్యంపై ఆచార్య మాణిక్‌రెడ్డి పర్యవేక్షణలో పరిశోధన చేశారు. వీరేంద్రబాబు సమర్పించిన పరిశోధనకు పీహెచ్‌డీ పట్టా లభించింది. వీరేంద్రబాబు ప్రస్తుతం నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల అటవీశాఖ రేంజ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆలూర్ గ్రామానికి చెందిన వీరేంద్రబాబు పీహెచ్‌డీ పట్టా అందుకోవడంపై గ్రామ సర్పంచ్ కల్లెం మోహన్, ఉప సర్పంచ్ దుమ్మాజీ శ్రీనివాస్, ఎంపీటీసీలు మోతె బోజకళ, మర్కంటి లక్ష్మీమల్లేశ్ , నాయకులు, ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగం అశోక్ సంతోషం వ్యక్తం చేశారు.

మదన్‌పల్లికి చెందిన ఆర్మీ ఉద్యోగికి...
మాక్లూర్ : మండలంలోని మదన్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ అధికారి పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు. ఓయూ స్నాతకోత్సవంలో మాక్లూర్ మండ లం మదన్‌పల్లి గ్రామానికి చెందిన పెంటకాడి శ్రీనివాస్ పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు.లెప్టినెంట్ కల్నల్ హోదాలో పనిచేస్తున్న ఆయన, సైకలాజిస్ట్ విభాగంలో ఇటీవల పీహెచ్‌డీ పూర్తిచేశారు. తనను ఉన్నత చదువులు చదివించిన తన తల్లి ఒడ్డెమ్మకు పట్టాను అంకితమిస్తున్నానని శ్రీనివాస్ తెలిపారు. సహకరించిన ఉద్యోగులు,స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాస్‌కు మదన్‌పల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

మందర్న వాసికి...
బోధన్ రూరల్: బోధన్ మండలంలోని మందర్న గ్రామానికి చెందిన వాగ్మారే రాముకు డాక్టరేట్ దక్కింది. గ్రామానికి చెందిన వాగ్మారే రాము మూడేండ్ల పాటు దృశ్య సంచార మాధ్యమంపై అధ్యయనం చేశారు. మంగ ళవారం హైదరాబాద్‌లోని ఓయూ వీసీ నుంచి డాక్టరేట్ అందు కున్నా రు. కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో వాగ్మారే రాము కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. డాక్టరేట్ సాధించడంతో గ్రామస్తులు అభినం దించారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles