ప్రైవేట్ పాఠశాలల బస్సుల అడ్డగింత


Tue,June 18, 2019 01:13 AM

బోధన్ రూరల్: బోధన్ మండలంలోని ఎరాజ్‌పల్లి గ్రామస్తులు ప్రైవేటు పా ఠశాలల బస్సులు తమ గ్రామానికి రావద్దని సోమవారం అడ్డుకున్నారు. తమ గ్రామానికి చెందిన పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకు పంపబోమని ఆదివారం తీ ర్మానం చేశారు. దీంతో సోమవారం ప్రైవే ట్ పాఠశాల బస్సులను రానివ్వకుండా అడ్డుకున్నారు. తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవం ఉన్న ఉ పాధ్యాయులు ఉన్నారని, నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా 30 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు వెంకటేశం, గోపాల్, సంజీవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...