ఆడ బిడ్డలను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్


Tue,June 18, 2019 01:13 AM

నిజాంసాగర్, నమస్తే తెలంగాణ: నిరుపేద కుటుంబంలో జన్మించి వివాహం చేయాలంటే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల ఆడబిడ్డలకు సీఎం కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టి వారిని ఆదుకుంటున్నారని ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు అన్నారు. సోమవారం తన స్వగ్రామమైన మహమ్మద్‌నగర్‌లో తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగిసినందున చెక్కులు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. 30 సంవత్సరాల నుంచి తాను రాజకీయంలో కొనసాగినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న గొప్ప పథకాలు గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. అందుకే ప్రజలు మళ్లీ రెండోసారి కేసీఆర్‌ను సీఎంను చేశారని అన్నారు. మండలంలో సింగితం, గాలీపూర్, దూప్‌సింగ్‌తండా, మహమ్మద్‌నగర్, అచ్చంపేట్, బంజపల్లి తదితర గ్రామాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంజయ్‌రావు, నూతనంగా ఎన్నికైన ఎంపీపీ పట్లోల్ల జ్యోతి దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీగా ఎన్నికైన మనోహర్, పార్టీ మండల అధ్యక్షుడు గైని విఠల్, నీటిసంఘం అధ్యక్షుడు గంగారెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సాదుల సత్యనారాయణ, సర్పంచ్‌లు దఫేదార్ బాలమణి, సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, సంగమేశ్వర్‌గౌడ్, రమేశ్‌గౌడ్, లకా్ష్మరెడ్డి, నాయకులు వాజిత్, మహేందర్, కాశయ్య, గంగి రమేశ్, అచ్చంపేట్ సత్యనారాయణ, సాకలి రమేశ్, బంజపల్లి సందీప్ తదితరులు హాజరయ్యారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...