టీయూలో డిగ్రీ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం


Tue,June 18, 2019 01:12 AM

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో జరిగిన రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ల పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం సోమవారం కంప్యూటర్ సైన్స్ కళాశాలలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పి.సాంబయ్య మాట్లాడారు. డిగ్రీ పరీక్షల మూల్యాంకనం చాలా పటిష్టంగా, పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ప్రతి ఒక్క పరీక్ష పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మూల్యాంకనం చేయాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు అంతా వారు రాసిన పరీక్షా పత్రాలలోనే ఉన్నందువల్ల జాగ్రత్తగా పేపర్లు దిద్దాలని కోరారు. సమయపాలన పాటించాలని, మూల్యాంకనాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని అన్నారు. మొదటి రోజు ఇంగ్లిష్, జెండర్ సెన్సిటైజేషన్‌కు సంబంధించిన పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించామని ఆయా సబ్జెక్టులలో బోధనానుభవం కలిగిన అధ్యాపకుల చేతనే పరీక్షా పత్రాలను దిద్దిస్తున్నామని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కె.సంపత్‌కుమార్ తెలియజేశారు. ఈ మూల్యాంకనానికి సంబంధించిన పనులను అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ అబ్దుల్ ఖవి నిర్వర్తిస్తున్నారని ఆయన తెలిపారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...