ట్రిఫుల్ ఐటీ విద్యార్థులకు సన్మానం


Tue,June 18, 2019 01:11 AM

వేల్పూర్: మండలంలోని ఆయా గ్రామాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బాసర ట్రిఫుల్ ఐటీకి ఎంపిక కావడంతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వారిని వేల్పూర్‌లో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొ నే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరా రు. అనంతరం ట్రిఫుల్ ఐటీకి ఎంపికైన అశ్విని, మనీష, చింటు, శివా ణి, రమ్య, వినీత్, గాయత్రీ, రమ్య, శ్రీనివాస్ పలువురు విద్యార్థుల ను ఘనంగా సన్మానించారు. విద్యార్థుల ఎంపికకు కృషి చేసిన ఉపాధ్యాయులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లింగం, సురేశ్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు గంట అ శోక్, ప్రశాంత్‌రెడ్డి, ఉపసర్పంచ్ పిట్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...