ఎస్సీ వర్గీకరణ అంశాన్ని త్వరగా పరిష్కరించాలి


Mon,June 17, 2019 03:07 AM

ఖలీల్‌వాడీ: ఎస్సీ వర్గీకరణ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేగుంట సునీల్, అధికార ప్రతినిధి కొక్కెర భూమన్న కోరారు. ఆదివారం జూలై 7న చలో హైదరాబాద్ పోస్టర్లను రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి గతంలో అనేకసార్లు ఎస్సీ వర్గీకరణ అంశం పై మాట్లాడారని తెలిపారు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయినందున ఈ అంశంపై చొరవ చూపాలని కోరారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇందిరాపార్కులో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నాంపల్లి, విద్యాసాగర్, డప్పుల చంద్రయ్య, ఓమాల సురేశ్, సుధాకర్, పోచిరాం, సాయన్న, సరిత, లత, రాంచందర్ లింగన్న, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...