విద్యా వలంటీర్లకు మళ్లీ అవకాశం


Mon,June 17, 2019 03:05 AM

ఇందూరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్లుగా కొనసాగుతున్న వారిని ఈ విద్యాసంవత్సరం కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం 1,101 మంది విద్యా వలంటీర్లకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభోదన చేస్తున్న విద్యా వలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 2,167 ప్రభుత్వ పాఠశాలల పరిధిలో పనిచేస్తున్న విద్యావలంటీర్లు మరో ఏడాది కొనసాగనున్నారు. వీరు యథావిధిగా తమ విధులకు హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడిబాట కార్యక్రమంలో ఇప్పటికే వారు పాల్గొంటున్నా రు. గతంలో విద్యా వలంటీర్లకు రూ.8వేల వేతనం ఇచ్చేవారు. కాగా గతేడాది రాష్ట్ర ప్రభుత్వం వీరి వేతనాన్ని రూ.12 వేలకు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని విద్యావలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాది పాటు ఉద్యోగాన్ని పొడగించడంతో కుటుంబాలకు బాసటగా నిలిచారన్నారు. విద్యావలంటీర్ల వేతనాన్ని సైతం గతంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పాటుపడతామన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...