జిల్లా కేంద్రంలో పట్టపగలే దొంగతనం


Sun,June 16, 2019 03:02 AM

నిజామాబాద్‌ క్రైం: జిల్లా కేంద్రంలోని నాలుగో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పట్టపగలే ఓ తాళం వేసిన ఇంటికి కన్నం వేసిన దుండగులు బంగారు నగలతో పాటు వెండి వస్తువులు, నగదు దోచుకుపోయారు. పోలీసుల కథనం.. స్థానిక న్యూ హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళంవేసి బాసర పుణ్యక్షేత్రానికి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వెళ్లిన వారు సాయంత్రం 7 గంటలకు తిరిగి వచ్చారు. వారు వచ్చే సరికి ఇంటికి మరో వైపు వేసి ఉన్న తాళం ధ్వంసం చేసి ఉండడంతో అనుమానం కలిగి లోనికి వెళ్లి చూడగా ఇంట్లోని బీరువా ధ్వంసం చేసి ఉంది. అందులోని వస్తువులన్నీ చిందర వందరగా పడవేసి ఉన్నాయి. దీంతో వారు సంబంధిత నాలుగో టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు బీరువాలో ఉన్న మూడు తులాల బంగారు నగలు, 20 తులాల వెండి వస్తువులతో పాటు రూ.30 వేలు నగదు దోచుకుపోయారు. ఈ సంఘటనపై బాధితు రాలు మణిమాల పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...