‘హరితహారం’ ప్రణాళికలు రూపొందించుకోవాలి


Sun,June 16, 2019 03:01 AM

నిజామాబాద్‌ రూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది తగిన ప్రణాళికను ముందుగానే రూపొందించుకోవాలని రూరల్‌, మోపాల్‌ మండలాల ఎంపీడీవో డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ సూచించారు. శనివారం నిజామాబాద్‌ మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఉమ్మడి మండలాల్లోని జీపీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఉమ్మడి మండలాల్లోని 40 గ్రామాల్లో నర్సరీలను నెలకొల్పి మొత్తం 17లక్షల 10వేల మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఏయే ప్రదేశాల్లో మొక్కలు నాటాలో స్థలాలను గుర్తించి నివేదికను సమర్పించాలన్నారు. సర్పంచ్‌ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి హరితహారం విజయవంతం చేయడాకి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలని సూచించారు. ఉపాధిహామీ తరఫున 25 నర్సరీల్లో ఫారెస్ట్‌ తరఫున 15 నర్సరీల్లో మొక్కల పెంపకం కొనసాగుతున్నదని, అవి ఎండిపోకుండా నీరు అందించాలన్నారు. సమావేశంలో ఈవో పీఆర్డీ సుబ్రహ్మణ్యం, ఏపీవో పద్మ, ఇన్‌చార్జి ఈసీ ఉమేశ్‌కుమార్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...