జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతా


Sat,June 15, 2019 02:58 AM

మాక్లూర్‌: అందరి సహకారంతో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. సామాన్య రైతు కుంటుంబం నుంచి జడ్పీచైర్మన్‌ స్థాయికి రావడం సంతోషంగా ఉందని, తనకు రైతుల కష్టసుఖాలు తెలుసని అన్నారు. తన స్వగ్రామం మాక్లూర్‌ మండలం వెంకటపూర్‌లో సర్పంచ్‌ భవానీ అధ్యక్షతన జరిగిన పాఠశాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం మూతబడిన బడిని తన చేతుల మీదుగా మళ్లీ ప్రారంభించుకోవడం అనందంగా ఉందన్నారు. సర్కారు బడి ప్రారంభానికి దాతల సహకారం అభినందనీయమన్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం, పాఠశాలకు ప్రహరీ అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆదర్శంగా నిలిచిన జిల్లా పరిషత్‌ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ రూ. 10 కోట్లు కేటాయిస్తానని చెప్పినట్లు గుర్తు చేశారు. మాజీ ఎంపీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్‌, బాజిరెడ్డి గోవర్దన్‌, బిగాల గణేశ్‌ సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకుందామని, అందుకు అనుగుణంగా పాఠశాలను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. అనంతరం పీఆర్టీయు కార్యదర్శి కమలాకర్‌రావు మాట్లాడుతూ.. పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు రూ. 10వేల విరాళం అందచేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మాస్త ప్రభాకర్‌, ఎంపీడీవో సక్రియా, ఎంఈవో రాజగంగారెడ్డి, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, నాయకులు జలపతిరావు, పి.విఠల్‌రావు, రఘురావు, బీరెల్లి రమణారావు, కాంతారావు, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...