బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోవాలి


Fri,June 14, 2019 04:08 AM

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ : పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని లకా్ష్మపూర్ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు బయోమెట్రిక్‌ను అమలు చేయాలని కోరారు. గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్క విద్యార్థి బడిలో చేరేలా చూడాలని సూచించారు. ఉపాధ్యాయులు పనివేళలను తప్పక పాటించాలని, విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని ఆదేశించారు. అనంతరం ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల తీరును పరిశీలించారు. ఆయన వెంట ఎల్లారెడ్డి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశం ఉన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...