ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం


Mon,May 27, 2019 01:37 AM

ఇందూరు : ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకొని సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారని మాజీ మేయర్, టీఆర్‌ఎస్ నాయకుడు డీ.సంజ య్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ.. నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కవితకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన కవిత తెలంగాణకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు అందుకున్నారని గుర్తు చేశారు. 4లక్షల10వేల మంది తమ ఓటును టీఆర్‌ఎస్‌కు వేశారన్నారు.

పసుపుబోర్డు కోసం కవిత అలుపెరగని కృషి చేశారని, బీజేపీ మాత్రం రైతుల జీవితాలతో ఆడుకొని ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం పసుపు బోర్డు అంశాన్ని అస్త్రంగా వినియోగించుకొని దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి రెండు లక్షలకు పైగా ఓట్లు పోలవగా ఈ సారి 60వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం బయటపడిందని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ కవిత అన్ని తానై ప్రతి నియోజకవర్గంలో పర్యటించి బంపర్ మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించారని గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో వెంకటేశ్వర్‌రావు, వెంకట్, గౌతమ్, నిల్పేశ్ పాల్గొన్నారు.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...