సుస్థిర సాగు.. రైతు బాగు!


Sun,May 26, 2019 03:14 AM

-జిల్లాలో జాతీయ సుస్థిర వ్యవసాయానికి అడుగులు
-పైలెట్ ప్రాజెక్టుగా ఒక్కో మండలం నుంచి ఒక్కో గ్రామం
-పొలాల్లో మట్టి నమూనాల సేకరణ
-త్వరలో సాయిల్ కార్డులు పంపిణీ
-అధిక ఎరువుల వాడకం తగ్గించడమే లక్ష్యం

నిజామాబాద్ సిటీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభ్యున్నతికి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు రైతులకు మేలు చేసే పథకాలతో పాటు పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మరో పైలెట్ ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. తక్కువ ఎరువుల వాడకం..తక్కువ పెట్టుబడి ఖర్చు.. భూసారాన్ని ఎలా కాపాడుకోవాలి..రైతులకు సేంద్రియ సాగు విధానాలపై కేంద్ర ప్రభుత్వం జాతీయ సుస్థిర వ్యవసాయ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా రైతుల భూముల్లో నుంచి మట్టి నమూనాలు సేకరించి వారికి తక్కువ ఎరువులతో భూసారాన్ని ఎలా కాపాడుకోవడంపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో రైతుల పొలాల నుంచి నుంచి ఇప్పటికే మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్‌ల్లో పరీక్షిస్తున్నారు. త్వరలోనే ఫలితాలు వెల్లడించి రైతులకు మట్టి పరీక్ష ఆరోగ్య కార్డులను అందజేస్తారు.

జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జాతీయ సుస్థిర వ్యవసాయ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో సుమారు 2,50,000 రైతులు ఉండగా, 1,50,000 హెక్టార్ల పంట విస్తర్ణం ఉంది. ఈ పథకం కింద ఒక్కో మండలం నుంచి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. ఆ గ్రామంలో రైతు కమతాలను బట్టి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. సేకరించిన మట్టిని జిల్లా కేంద్రంలో మట్టి పరీక్ష కేంద్రాలకు తరలించి, అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల అనంతరం రైతులకు ఫలితాలు వెల్లడించి వారికి ఏ పంట ఎంత ఎరువు ఉపయోగించాలి, తద్వారా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని అనే అంశంపై అవగాహన కల్పిస్తారు. ఇలా చేయడంతో రైతులకు అధిక ఎరువు వినియోగం తగ్గుతుంది, పంట పెట్టుబడి ఖర్చు తక్కువ, పంట నష్టపోకుండా రైతులకు పంట లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

ఎంపికైన గ్రామాలు ఇవే...
జిల్లాలో 27 మండలాలు ఉన్నాయి. జాతీయ సుస్థిర వ్యవసాయ పరీక్ష పథకం కింద మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. రాంపూర్(ఆర్మూర్), లకా్ష్మపూర్(మాక్ల్లూర్), సిర్‌పూర్(నందిపేట్), కిసాన్‌నగర్(బాల్కొండ), సోన్‌పేట్(మెండోర), వెంచిర్యాల్(ముప్కాల్), తాళ్లరాంపూర్(ఏర్గట్ల), కారెపల్లి(భీమ్‌గల్), లకా్ష్మపూర్(కమ్మర్‌పల్లి), దోన్‌పాల్(మొర్తాడ్), అమీనపూర్(వేల్పూరు), నర్సాపూర్(బోధన్), అంకంపల్లి(నవీపేట్), కూనేపల్లి(రెంజల్), పోచారం(ఎడపల్లి), కొటల్‌పల్లి(ధర్పల్లి), వెంగల్‌పాడ్(ఇందల్వాయి), పోతునూర్(సిరికొండ), ఆరెపల్లి(డిచ్‌పల్లి), మాదాపూర్ (జక్రాన్‌పల్లి), తాడెం(మోపాల్), లకా్ష్మపూర్(నిజామాబాద్ రూరల్), అర్సపల్లి(నిజామాబాద్ నార్త్), ఫకీరాబాద్(కోటగిరి), సిద్దాపూర్(రూద్రుర్), మల్లారం(వర్ని) గ్రామాలను ఎంపిక చేశారు. మట్టి నమూనాల పరీక్షల తర్వాత ప్రతీ గ్రామంలో ఒక రైతును ఎంపిక చేసి సేంద్రియ సాగుపై అవగాహన కల్పించనున్నారు.

మే 6న ప్రారంభం...
జిల్లాలో జాతీయ సుస్థిర వ్యవసాయ పథకాన్ని ఈనెల 6న ప్రారంభించారు. ఒక్కో మండల కేంద్రంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఈనెల 6న మట్టి నమూనాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రక్రియ ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగింది. ఈనెల 28 వరకు మట్టి నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించనున్నారు. కాలువ, బోరు పంట సాగు భూమి, వర్షాధారిత బీడు భూముల నుంచి మట్టి నమూనాలను సేకరించారు. ఈ పథకంలో 4,873 రైతులను గుర్తించి 4,094 మట్టి నమూనాలు సేకరించారు. ఇందులో బోరు పంట సాగు భూమి, వర్షాధారిత బీడు భూముల నుంచి మట్టి నమూనాలను సేకరించారు. ఈ పథకంలో 4,873 రైతులను గుర్తించి 4,094 మట్టి నమూనాలను సేకరించారు. రెంజల్ మండలం కూనేపల్లి గ్రామంలో 267 మట్టి నమూనలు.. అత్యల్పంగా భీమ్‌గల్ మండలం కారేపల్లి గ్రామంలో 71 మట్టి నమూనాలను వ్యవసాయాధికారులు సేకరించారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...