చకచకా ధాన్యం సేకరణ


Sat,May 25, 2019 02:43 AM

ఖలీల్‌వాడి : ఈ యాసంగి సీజన్‌లో రైతులు పండిన ధాన్యం సేకరణ చకచకా సాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 295 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ధాన్యం అమ్మిన రైతులకు వారివారి ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేస్తున్నారు.
295 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 295 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 3,51,529 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అన్ని కొనుగో లు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చిన ధాన్యం వచ్చినట్లుఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు.
నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బుల జమ..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు సకాలంలో చెల్లించాల్సిన ధాన్యం డబ్బులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైతులు సైతం కొనుగోలు కేంద్రాలకే నేరుగా ధాన్యాన్ని తీసుకొస్తున్నా రు. డబ్బు చెల్లింపులో ఎక్కడా ఆలస్యం జరగ కుండా తాగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డబ్బులు వచ్చిన వెంటనే సకాలంలోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడైనా కొనుగోలు, డబ్బు చెల్లింపుల్లో ఇబ్బందులు వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తే సత్వరమే సమస్య ను పరిష్కారం చేస్తున్నారు.
రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు..
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. ఇప్పటి వర కు 3,41,605 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లుల కు తరలించారు. మరో 9,923 మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని తరలించాల్సి ఉంది. ఆయా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం రోజుల తరబడి నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నారు.
కొనుగోళ్ల విలువ రూ.620 కోట్లు..
జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో లక్ష్యానికి అనుగుణం గా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. వీటి విలువ రూ.620.51 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రైతులకు రూ. 234.71 కోట్లు చెల్లించారు. కాగా.. ఇంకా రూ. 385.79 కోట్లు చెల్లించాల్సి ఉంది.
అందుబాటులో గన్నీబ్యాగులు..
ధాన్యం నింపేందుకు అవసరమైన గన్నీ బ్యాగుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. ఇప్పటివరకు రైతులకు అవసరమైనన్ని గన్నీ బ్యాగులు అందుబాటు ఉంచారు. ఏ రైతుకు ఎంత దిగుబడి వచ్చింది? ఎన్ని బ్యాగులు అవసరమో సరిచూసుకొని ఇస్తున్నారు. దీంతో రైతులు తమ పొలాల నుంచి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...