ఉదయం భగభగ.. రాత్రి చల్లచల్లగా..


Sat,May 25, 2019 02:42 AM

నిజామాబాద్ సిటీ/రెంజల్ : జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపం కూడా ఉదయం 8.30 గంటల నుంచే చూపిస్తున్నాడు. సాయంత్రం 6 గంటలు దాటినా ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. శుక్రవారం 44.6 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. కనిష్ఠంగా 29.6 ఉష్ణోగ్రత నమోదైంది. కాగా గురువారం రాత్రి 1.5 మీ.మీ వర్షం కురియగా.. కొద్దిసేపు వాతావర ణం చల్లగా మారింది. దీంతో ప్రజలు ఉపశమనం పొందారు. రెండుమూడు రోజులుగా జిల్లాలో ఇదే ప రిస్థితి కనిపిస్తున్నది. ఉదయం పూట ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే తమ పనులను చేసుకుంటున్నారు. 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తమ పనులకు స్వస్తి పలుకుతున్నారు. అత్యవసరమైతే కానీ బయటకు రావడం లే దు. జిల్లా కేంద్రానికి పని కోసం వివిధ గ్రామాల నుం చి వచ్చే ప్రజలు మాత్రం స్కార్ఫ్‌లు, టవల్స్ కట్టుకొని తమ పనులను ఎండ వేడిమిలోనే చేసుకొని వెళ్లిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే ప్రధాన దారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ప్రజలు ఎండవేడిమికి దాహం తీర్చుకునేందుకు ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసిన చలివేంద్రాల వద్ద వారి దాహార్తిని తీర్చుకుంటున్నారు. ఇక కొబ్బరి బోండాల షాపు ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. జ్యూస్ సెంట ర్ల వద్ద అత్యధికంగా జనాలు కనిపిస్తున్నారు. రోహిణి కార్తె సమీపిస్తున్న తరుణంలో ఎండలు ఏ విధంగా ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మ రో ఐదు రోజుల పాటు ఈదురుగాలులు, వడగాల్పుల ప్రభావం ఉంటుందని, ప్రజలు అవసరమైతే తప్ప బ యటకు రావొద్దని వారు సూచిస్తున్నారు. రెంజల్ మండలంలో ని దూపల్లి, కళ్యాపూర్, దండిగుట్ట తదితర ప్రాంతాల్లో శుక్ర వారం వర్షం కురిసింది.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...