మానవతా సదన్ సందర్శన


Sat,May 25, 2019 02:41 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: మండల కేంద్రంలోని మానవతా సదన్‌ను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ సందర్శించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మానవతా సదన్‌లో నిర్వహిస్తున్న వేసవి క్యాంపు పర్యవేక్షణలో భాగంగా సదన్‌ను సందర్శించారు. సదన్ చిన్నారులు నేర్చుకుంటున్న ఒకేషనల్ శిక్షణ-డ్రాయింగ్, పేయింటింగ్, అల్లికలు తయారు చేయుట, డోర్ కర్టెన్స్, గ్లాస్ పేయింటింగ్, గిఫ్ట్ వస్తువులను పరిశీలించి అభినందించారు. మాస్టర్ అజయ్ నేతృత్వంలో శిక్షణ పొందుతున్న డప్పు డ్యాన్స్, భరతనాట్యం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. ఎండలను దృష్టిలో పెట్టుకొని పిల్లలు అధిక మోతాదులో నీరు తాగాలని ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సమ్మర్ క్యాంప్ శిక్షణ ఇస్తున్న అజయ్, కల్పనను అభినందించారు. శిక్షణ ఇస్తున్న నవనీతను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో కేర్ టేకర్ రమేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...