కొనసాగుతున్న జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నీ


Sat,May 25, 2019 02:41 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ: ఆర్మూర్‌లో 37వ జాతీయ స్థాయి జూనియర్స్ సాఫ్ట్‌బాల్ టోర్నీ కొనసాగుతున్నది. రెండో రోజు శుక్రవారం నిర్వహించిన పోటీలకు స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో శరీర దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. క్రీడల్లో రాణిస్తే సమాజంలో గుర్తింపు, గౌరవం ఉంటుందని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను ఉదహరించారు. క్రీడల కోసం రోజూ కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌వీ హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మూర్‌లో జరుగుతున్న ఈ పోటీలకు 22 రాష్ర్టాల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు హాజరుకావడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శోభన్‌బాబు, జిల్లా కార్యదర్శి గంగామోహన్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కలిగోట్ సాయన్న, సురేశ్, అనీల్, వినోద్, అన్వేశ్, జోత్స్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...