నిజామాబాద్‌లో బీజేపీ పాగా..


Fri,May 24, 2019 02:26 AM

-నిజామాబాద్ లోక్‌సభ స్థానం బీజేపీ కైవసం
-ఆ పార్టీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ విజయం
-టీఆర్‌ఎస్ అభ్యర్థి కవితపై 70,875 ఓట్ల ఆధిక్యత
-మూడోస్థానానికి పరిమితమైన కాంగ్రెస్

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : టీఆర్‌ఎస్ కంచుకోట ఇందూరు గడ్డపై అనూహ్యంగా తొలిసారి బీజేపీ పాగా వేసింది. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఘన విజయం సొంతం చేసుకున్నా డు. సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై 70వేల ఓట్ల మెజార్టీతో గెలుపొం ది కొత్త అధ్యాయానికి నాంది పలికారు. సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తనయుడైన ధర్మపురి అర్వింద్ తన రాజకీయ అరంగేట్రంతోనే ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నా రు. బీజేపీ శ్రేణులకు ఈ పరిణామం కొత్త ఊపునిచ్చింది.

ధర్మపురి అర్వింద్‌కు 4,80,584 ఓట్లు పోల వ్వగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు 4,09,709 ఓట్లు వచ్చాయి. కాగా అత్యల్పంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కీ 69,240 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అర్వింద్ గెలుపుతో కమలనాథులు జిల్లా వ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. నిజామాబాద్ నగరంలో ర్యాలీ నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గురువారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ తొలి రౌండ్ ఫలితాల వెల్లడికి కాస్త సమ యం పట్టింది. పదకొండు గంటల తర్వాత తొలిరౌండ్ ఫలితాలు వచ్చాయి. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో కౌంటింగ్ ప్రక్రియలో జా ప్యం జరగకుండా 36 టేబుళ్లను ఏర్పాటు చేశా రు. రౌండ్ల వారీగా ఫలితాల సమయం సగానికి తగ్గడంతో సాయంత్రం కల్లా తుది ఫలితాలు వ చ్చేశాయి. అయితే వీవీప్యాట్ల గణనతో పాటు అధికారికంగా వెల్లడించేందుకు అధికారులు సమ యం తీసుకున్నారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాం తంలో తుది ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.

ఆరంభం నుంచే రౌండ్ల వారీగా బీజేపీ అ భ్యర్థి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని బోధన్ మినహా నాలుగు నియోజకవర్గాలతో పాటు జగిత్యాల, కో రుట్ల నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి ఆధిక్యత వచ్చింది. నిజామాబాద్ అర్బన్‌లో సైతం టీఆర్‌ఎస్ కొన్ని రౌండ్లలో ఆధిక్యతను కనబర్చింది. ఉ దయం 10గంటల ప్రాంతంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి కవిత డిచ్‌పల్లిలోని కౌంటింగ్ కేంద్రానికి వచ్చి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. మధ్యాహ్నం తర్వాత బీ జేపీ ఆధిక్యత కనబరుస్తున్న సమయంలో అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కౌంటింగ్ కేంద్రానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. సాయంత్రం సమయానికి ఫలితాల్లో స్పష్టత రావడంతో ఇక బీజేపీ గెలుపు అనివార్యమని గ్రహించిన ఆ పార్టీ శ్రేణులు.. కౌంటింగ్ కేంద్రం సమీపంలో పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

కాగా, టీఆర్‌ఎస్ శ్రే ణులు చివరి రౌండ్ వరకు ఫలితాలను ఉత్కంఠ గా గమనించారు. ఆఖరి రౌండ్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యతను కనబరిచి గెలుపు తీరాలకు చేరుతుందని అంతా భావించారు. సాయంత్రం వరకు కౌం టింగ్ ప్రక్రియ ఉత్కంఠను రేకెత్తించేలా కొనసాగింది. తొలిరౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు బీ జేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తూ గెలుపు తీరాలకు చేరారు. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ తన దూకుడును ప్రదర్శించింది. మోడీ హవా కొనసాగింది. పల్లె ప్రజ ల్లో సైతం మోడీ ప్రభావం చూపారనడానికి ఈ ఫలితాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

అర్వింద్‌కు 70,875 ఓట్ల మెజార్టీ..
ఖలీల్‌వాడి : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ 70,875 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ధర్మపురి అర్వింద్‌కు ఈవీఎం ఓట్లు 4,79,748 , పోస్టల్ ఓట్లు 836 కలిపి 4,80,584 ఓట్లు పోలవ్వగా.. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు ఈవీఎం ఓట్లు 4,09,481, పోస్టల్ ఓట్లు 221 కలిపి 4,09,709 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కీగౌడ్‌కు ఈవీఎం ఓట్లు 69,173, పోస్టల్ ఓట్లు 67 కలిపి 69,240 ఓట్లు వచ్చి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పిరమిడ్ పార్టీ అభ్యర్థి అంజయ్యకు 1229 ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీ అభ్యర్థి శంకర్‌కు ఈవీఎం ఓట్లు 2019, పోస్టల్ ఓట్లు 4 కలిపి మొత్తం 2023 ఓట్లు వచ్చాయి. సమాజ్‌వాదీ బ్లాక్ పార్వర్డ్ అభ్యర్థి చక్రధర్ శర్మకు 495 ఓట్లు వచ్చాయి. బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి సాగర్‌కు ఈవీఎం ఓట్లు 754, పోస్టల్ ఓట్లు 3 కలిపి మొత్తం 757 ఓట్లు వచ్చాయి.

నోటాకు రెండు వేల పైనే...
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నన్ ఆఫ్ ది ఓటు నోటాకు 2031 ఓట్లు పడ్డా యి. ఇందులో ఈవీఎం ఓట్లు 2,029 ఉండగా.. పోస్టల్ ఓట్లు 2 ఉన్నాయి.

స్వతంత్రులకు భారీగా ఓట్లు...
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వతంత్రులు పెద్ద ఎత్తున పోటీ పడిన సంగతి తెలిసిందే. స్వతంత్రులు అందరికీ కలిపి 96,700 ఓట్లు పోలవడం విశేషం.

251
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...