కౌంటింగ్‌కు మూడంచెల బందోబస్తు


Thu,May 23, 2019 01:29 AM

నిజామాబాద్ క్రైం / డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కౌంటింగ్ నిర్వహించే డిచ్‌పల్లి మండల కేంద్రంలో సీఎంసీ కళాశాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసు కమిషనర్ కార్తికేయ తెలిపారు. రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు భద్రతా సిబ్బంది (సెక్యూరిటీ) చూపిస్తేనే కౌంటింగ్ కేంద్రానికి ప్రవేశం ఉంటుందన్నారు. కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, మద్యం అమ్మకాలు బుధవారం సాయంత్రం 5గంటల నుంచి కౌంటింగ్ పూర్తయి ఫలితాలను వెలువరించే వరకు నిషేధించామని తెలిపారు. సెల్‌ఫోన్లు, అగ్గిపెట్టేలు, లైటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను వంటి నిషేధిత వస్తువులను హాల్‌లోకి తీసుకెళ్లడానికి అవకాశం లేదన్నారు.

కౌంటింగ్ కేంద్రాల చుట్టూ, పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ గుమికూడి ఉండవద్దని సూచించారు. పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉంచామని, అందరినీ తనిఖీ చేస్తారని, గెలుపొందిన అభ్యర్థులు గురువారం విజయోత్సవ ర్యాలీ నిషేధించామని, ఫలితాలు వెలువడిన తదనంతరం ర్యాలీలు నిర్వహణకు సంబంధిత పోలీసు అధికారులు రాత పూర్వకంగా అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోలీస్, రెవెన్యూ సిబ్బందికి సహకరించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పికెట్ల ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. బెట్టింగ్ పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. సీపీ ఒకరు, అదనపు డీసీపీ ఒకరు, ఏసీపీలు 12 మంది, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు 26 మంది, సబ్ ఇన్‌స్పెక్టర్లు 89 మంది, ఏఆర్, సివిల్ సిబ్బంది, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు 1,108 మంది, హాంగార్డులు, మహిళా హాంగార్డులు 310... మొత్తం 1,547 మందిని ఈ లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం నియమించినట్లు చెప్పారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...