సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన


Thu,May 23, 2019 01:29 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన డిచ్‌పల్లిలో ఓట్ల లెక్కింపు జరిగే సీఎంసీ కళాశాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్లో ఇతర సదుపాయాలను పరిశీలించారు. మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా కేటాయించిన మీడియా కేంద్రాన్ని పరిశీలించారు. మీడియాకు ఫలితాలకు సంబంధించి ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా సమాచారం అందించడానికి డిస్లే(ప్రదర్శన) బోర్డులు ఏర్పాటు చేయాలని ఉప సంచాలకులు ముర్తుజాను ఆదేశించారు. మీడియా కేంద్రంలో మీడియా ప్రతినిధులకు అవసరమైన సదుపాయాలు సమకూర్చుకోవాలన్నారు. మీడియా ప్రతినిధులకు వాహనాల పార్కింగ్‌కు వేరుగా స్థలాన్ని కేటాయించాలని పోలీసు కమిషనర్‌కు సూచించారు. అదే విధంగా కౌంటింగ్ కేంద్రాల్లో సిబ్బందికి కౌంటింగ్ ఏజెంట్లు రావడానికి వెళ్లటానికి వేర్వేరుగా దారులు ఏర్పాటు చేసి బారీకేడింగ్ చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బంది నిర్ణీత సమయంలో అందుబాటులో ఉండాలని ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయ రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను సరిచూసుకోవాలన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...