లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు భారీ బందోబస్తు


Thu,May 23, 2019 01:28 AM

నిజామాబాద్ క్రైం: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పో లీసు కమిషన్ కార్తికేయ తెలిపారు. బుధవారం పో లీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వి లేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. డిచ్‌పల్లిలోని సీఎంసీ కళాశాలలో ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచామని, అక్కడ కూడా సెంట్రల్ పారామీటరీ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మూడు లెవల్లో సె క్యూరిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఓట్ల లెక్కిం పు నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా మూడు పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. నడిపల్లిలోని సీఎంసీ ఎక్స్ రోడ్డు వద్ద, డిచ్‌పల్లి స్టేషన్ రోడ్డు దేవులపల్లి గాంధీ విగ్రహం వద్ద, సుద్దపల్లి దేవినగర్ వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నడిపల్లిలోని సీఎంసీ ఎక్స్‌రోడ్ వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు నుంచి ఓట్ల లెక్కింపునకు వెళ్తున్న అధికారులు, ఏజెంట్లు, సిబ్బంది, మీడియా వారికి గుర్తింపు కార్డులు చూసిన తర్వాతే అనుమతిస్తారన్నారు. మూడు చోట్ల వాహనాల పార్కింగ్‌కు ఏర్పాటు చేశామని ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపా రు.

దేవులపల్లిలోని జీబీ వైన్స్ ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో ఆర్మూర్, బాల్కొండ, డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, జక్రాన్‌పల్లి మండలాల వారు వాహనాలను నిలుపుతారన్నారు. దేవునగర్ పక్కన నిజామాబాద్ అర్బన్, బోధన్ మండలాల వాహనాలు, సీఎంసీ హాల్‌కు వంద మీటర్ల దూరంలో మేడిపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఖాళీ స్థలంలో ఆర్మూర్, నిజామాబాద్ కౌంటింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర అధికారులు సీఎంసీ హాల్ వెనుకభాగం నుంచి వచ్చేలా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పోలీసు కమిషనర్‌తో పాటు డీసీపీ శ్రీధర్‌రెడ్డి, 14 మంది ఏసీపీలు, 36 మంది సీఐలు, 90 మంది ఎస్సైలు, 186 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 465 మంది, 65 మంది మహిళా సిబ్బంది, 356 హోంగార్డులు ఎన్నికల కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకూ పటిష్ట బందోబస్తు ఉంటుందని సీపీ కార్తికేయ పేర్కొన్నారు. సమావేశంలో పోలీసు అధికారులు, ఎస్సైలు, ఏఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...