ఉద్యమనేత కర్నె శ్రీశైలంపై దాడి అమానుషం


Thu,May 23, 2019 01:27 AM

డిచ్‌పల్లి, సమస్తే తెలంగాణ: గురుకులాల్ల్లో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించిన ఎస్సీ జాతీయ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కర్నె శ్రీశైలంపై దాడి అమానుషమని తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు రవి ఖండించారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్యాయాన్ని ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా దాడి చేశారని తీవ్రంగా మండిపడ్డారు. గురుకులాల ప్రభుత్వ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్థాపించిన స్వేరోస్ ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థ అయినప్పటికీ తన ప్రైవేట్ సైన్యానిదే సర్వాధికారం కొనసాగుతున్నదని ఆరోపించారు. గురుకులాల్లో ఈ స్వేరోస్ జోక్యం ఏంటని ప్రశ్నించారు. ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వ అధికారాన్ని, అధికారులను ఉపయోగించుకుని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నప్పటికీ ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఈ స్వేరోస్ అరాచకాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సాయి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...