హైరిస్క్ కేంద్రాల్లో మెరుగైన వసతులు


Thu,May 23, 2019 01:27 AM

బోధన్, నమస్తే తెలంగాణ: క్లిష్టమైన ప్రసవాల కోసం ఏర్పాటు చేసిన హైరిస్క్ కేంద్రాల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రసవాల తేదీలు, ఇతర వివరాలను ఆన్‌లైన్ చేయిస్తున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ తెలిపారు. బోధన్ ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన హైరిస్క్ ప్రసవాల కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రికార్డులను పరిశీలించి, హైరిస్క్ కేసుల విషయంలో తీసుకుంటున్న చర్యలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె పలు సూచనలు చేస్తూ... హైరిస్క్ కేంద్రాలకు వచ్చే ప్రసవాలకు సంబంధించిన తేదీలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలన్నారు. రక్తహీనత ఉన్న గర్భిణుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారి వివరాలను నమోదుచేయాలన్నారు. 24 గంటలపాటు హెల్ప్ డెస్క్ పనిచేయాలని ఆదేశించారు. గర్భిణుల కోసం వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని దవాఖాన అధికారులకు సూచించారు. జాయింట్ డైరెక్టర్ వెంట సూపరింటెండెంట్ అన్నపూర్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో విద్య ఉన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...