ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలన


Thu,May 23, 2019 01:27 AM

నిజామాబాద్ రూరల్: నగరంలోని ఆర్యనగర్ ప్రాంతంలో కోటి రూపాయల వ్యయంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా ఇంజినీరింగ్ అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు. గదులను పరిశీలించిన అనంతరం ఇంజినీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయని, వచ్చే నెలలో శానిటరీ, పెయింటింగ్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌అండ్‌బీ డీఈ రాజేందర్, ఏఈ ప్రవీణ్ వివరించారు. ఈ క్యాంపు కార్యాలయ భవనం పూర్తయితే రూరల్ నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యల వినతులను స్వీకరించటానికి అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే బాజిరెడ్డి అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతున్నదని తెలిపారు. నియోజకవర్గం ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి ఎప్పటకప్పుడు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుందన్నారు. ప్రజలు నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను విన్నవించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...