నకిలీలపై ఉక్కుపాదం..


Wed,May 22, 2019 02:10 AM

-నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
-వ్యవసాయ, పోలీసు శాఖలు సంయుక్తంగా దాడులకు సిద్ధం
-నియోజకవర్గాల వారీగా టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటు
-పీడీ యార్డు కేసుల నమోదుకు రంగం సిద్ధం
-రోజువారీగా దాడుల నివేదికలు సీపీ, డీఏవోకు అందజేత

నిజామాబాద్ రూరల్/ నిజామాబాద్ సిటీ : ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేసే రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఆ మేరకు అవసరమైన చర్యలు ఎ ప్పటికప్పుడు తీసుకుంటున్నది. రైతులు పంట సాగు కోసం విత్తే విత్తనాలను ఫర్టిలైజర్స్ దుకాణాల్లో కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో దుకాణాల డీలర్లు అక్రమంగా డబ్బు సంపాదన కోసం కల్తీ విత్తనాలను విక్రయించే దుస్థితి పలుచోట్ల చూస్తున్నాం. దీంతో ఈ విషయం తెలియని అమాయక రైతులు విత్తనాలు కొనుగోలు చేసుకొని పంట పొలాల్లో విత్తినప్పుడు అవి మొలకెత్తక నష్టపోతున్నారు. ఫలితంగా రైతులు పెట్టుబడి ఖర్చులు మీద పడి ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో జరిగాయి.

ఈ నేపథ్యంలో అన్నదాతలు ఇలాంటి సంఘటనలను ఎదుర్కోవద్దని కల్తీ విత్తనాల విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమైంది. సీఎం కేసీఆర్ ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కల్తీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు అధికారుల బృందంతో దాడులు జరిపేందుకు ప్రణాళిక రూపొందించుకో వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగానే ప్ర భుత్వ ఆదేశం మేరకు మంగళవారం జిల్లాకేంద్రంలోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ, పోలీసుశాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్తీ విత్తనాల విక్రయాలను అరికట్టడంపై ఇరుశాఖల అధికారులు సమీక్షించారు. విత్తనాలు విక్రయించే దుకాణాలు, గోదాములపై, విత్తన ప్రాసెసింగ్ ప్రాంతాలపై దాడులు నిర్వహించేందుకు వ్యవసాయ, పో లీసుశాఖల సంయుక్త ఆధ్వర్యంలో అధికారులతో కూడిన బృం దాలను ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గం వారీగా రెండు శాఖల అధికారులతో దాడులు నిర్వహించేందుకు ఒక బృం దాన్ని నియమించారు. ఒక్కో బృందంలో పోలీసుశాఖ తరపున ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు, వ్యవసాయశాఖ త రఫున ఒకరు వ్యవసాయ సహాయ సంచాలకుడు, మండల వ్యవసాయాధికారి ఉంటారు. ఈ బృందం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న వి త్తనాలు విక్రయించే దుకాణాలపై దాడులు ని ర్వహించి ప్రతీరోజు నివేదికను సీపీకి, జిల్లా వ్య వసాయాధికారికి అందజేయాల్సి ఉంటుంది. అనం తరం రెండు శాఖల జిల్లా అధికారులు ఆ నివేదిక లను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది.

ఐదు నియోజకవర్గాల్లో...
ఈ విధంగా జిల్లాలోని నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, బోధ న్.. ఐదు నియోజకవర్గాల వారీగా అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ రూ రల్ నియోజకవర్గం అధికారుల బృందంలో జ క్రాన్‌పల్లి ఎస్సై ఎన్.సురేశ్‌కుమార్, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఏడీఏ వెంకటలక్ష్మి ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ బృందంలో 5వ టౌన్ ఎస్సై జాన్‌రెడ్డి, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఏడీఏ వెంకట రవీందర్, ఆర్మూర్ సెగ్మెంట్ బృందంలో ఎస్సై విజయ్ నారాయణన్, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఏడీఏ శంకర్ రాథోడ్, బాల్కొండ నియోజకవర్గ బృందంలో ముప్కాల్ ఎస్సై రాజ్ భరత్‌రెడ్డి, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఏడీఏ మల్లయ్య, బోధన్ నియోజకవర్గ బృందంలో రుద్రూర్ ఎస్సై సురేశ్, ముగ్గురు కానిస్టేబుల్, ఏడీఏ సంతోష్‌తో అధికార బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఇప్పటి నుంచే కల్తీ విత్తనాల విక్రయాల అరికట్టడంపై దాడులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి. సమావేశంలో నిజామాబాద్, ఆర్మూర్ ఏసీపీలు రాజారత్నం, రాములు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు మధుసూదన్, రాకేశ్, ఎస్సైలు జాన్‌రెడ్డి, రాజ్‌భరత్‌రెడ్డి, సురేశ్, విజయ్ నారాయణన్, ఎన్. సురేశ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్, ఏడీఏలు వెంకటరవీందర్, వెంకటలక్ష్మి, సంతోష్, శంకర్ రాథోడ్, ఆర్మూర్, భీమ్‌గల్ మండల వ్యవసాయాధికారులు హరికృష్ణ, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

పీడీ యాక్టు కేసులు...
నకిలీ విత్తనాల విక్రయదారులపై పీడీ యాక్టు కేసులు పె ట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే మా దిరిగా జిల్లాలో నకిలీ విత్తనాల మాఫియాను అరికట్టే విష యంలో జిల్లా యంత్రాంగం సక్సెస్ అయ్యింది. మళ్లీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈసారి కూడా వీటిపై డేగ కన్ను వేసిన యంత్రాంగం .. ఎక్కడికక్కడ ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి సారించింది. జిల్లాలో కల్తీ విత్తనాల కారణంగా రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. రైతుల జీవితాలతో ఆటలాడు తున్న కల్తీ విత్తన వ్యాపారులపై కఠినమైన చర్యలకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.

కల్తీ విత్తన వ్యాపారుల నడ్డి విరవాలని, ఇలాంటి వారిని ఏరిపారేయాలని వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ సంయుక్తగా టాస్క్‌ఫోర్సు బృందాలుగా ఏర్పాడి కల్తీ విత్తనాల వ్యాపారులపై దాడులు చేసి కేసు నమోదు చేయనున్నారు. జిల్లాలో కల్తీ విత్తనాల సరఫరా లేకుండా చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని ఆశయంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వానాకాలం సమీపిస్తుండంతో ఎట్టి పరిస్థితిల్లోనూ రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles