ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం


Tue,May 21, 2019 01:04 AM

పాత బాన్సువాడ : చట్టవ్యతిరేక కార్యకలాపాలు తగవని, అలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని.. ప్రధానంగా ఇసుక అక్రమ ర వాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు డీఎస్పీ యాదగిరి హెచ్చరించా రు. బాన్సువాడలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు ఇసుక రవాణాకు అనుమతినిస్తున్నారని కానీ ఇందుకు విరుద్ధంగా కొందరు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్నారు. దీంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, ప్రజా అవసరాలైన రహదారులు పాడవుతున్నాయని అ న్నారు. సంఘ విద్రోహక కార్యకలాపాలు, అనుమతిలేని కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బాన్సువాడ పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఇలాంటి కార్యకలాపాలకు తావులేద ని అన్నారు. డివిజన్‌ పరిధిలో అన్ని పోలీసు స్టేషన్లలో పోలీసు అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
జరిమానా విధించే రోజులు పోయాయి
ఇసుక అక్రమ రవాణా విషయంలో అక్కమార్కులకు జరిమానా విధించే రోజులు పోయాయని డీఎస్పీ అన్నారు. రాత్రిళ్లు ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా, ఎడ్లబండ్ల ద్వారా ఇసుక రవాణా చేస్తే ఇకపై బైండోవర్‌ చేసి జరిమానాలు విధించేది లేదని ఏకంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపడమేనని స్పష్టం చేశారు. డివిజన్‌ పరిధిలో పోలీసు అధికారులు ఇదే పద్ధతి అవలంభిస్తారని పేర్కొన్నారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాక్టర్‌ యజమానులు రహదారులపై కేజ్‌వీల్స్‌ తిరుగకుండా చూడాలని సూచించారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి వేసిన రహదారులు పాడవుతున్నాయన్నారు. పంట పొలాల వరకు ట్రాక్టర్‌ ద్వారా తీసుకెళ్లి అటుపై పంట పొలాల్లో బిగించుకుని దున్నకాలు సాగించాలని సూచించారు.
కాయిల్స్‌ చోరీపై నిఘా...
బాన్సువాడ డివిజన్‌ పరిధిలోని మద్నూర్‌, జుక్కల్‌ తదితర ప్రాంతా ల్లో ఇటీవల కాలంలో ట్రాన్స్‌ఫార్మర్స్‌లో కాయిల్స్‌, కాపర్‌ వైర్లు చోరీకి గురవుతున్న విషయంపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ మాత్రమే కాకుండా ప్రత్యేక బృందాల ద్వారా నిఘా పెంచినట్లు వివరించారు. చోరీకి పాల్పడిన దుండగులకు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వ్యవసాయ పంటపొలాల వద్ద పంపుసెట్లు, బోరు మోటార్లు ఉన్న రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...