సమస్యల పరిష్కారానికి కృషి


Tue,May 21, 2019 01:04 AM

నిజామాబాద్‌ క్రైం : రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పోలీస్‌ కళాబృందం సిబ్బందిచే ప్రచార కార్యక్రమాలు నిర్వ హిస్తున్నారు. మండలాలు, గ్రామాల వారీగా ఉన్న సమస్యలను తెలుసు కుని, ఆ సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రతలపై ప్రచారం చేస్తున్నారు. సమాజంలోని సమస్యలను పారద్రోలేందుకు పాటల రూపంలో, నాటకాల రూపంలో, కరపత్రాల ద్వారా పోలీస్‌ కళా బృందం ద్వారా ప్రదర్శనను నిర్వహించి ప్రజల మన్ననలను పొందాలని కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ అన్నారు. ‘డయల్‌ 100’ ఉపయోగం, ఎలాంటి సమస్య ఉన్న 5 నిమిషాల్లో సిబ్బంది చేరుకునే పద్ధతిని పోలీస్‌ కళాబృందాల ద్వారా జనాలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆవశ్యకత, సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు ఉపయోగపడే తీరుపై వివరించనున్నట్లు తెలిపారు. రహదారి భద్రత విషయంలో ప్రజ లు వాహనాలు నడిపే విధానం, వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్ర త్తాలు, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించడం, హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ వాడకం, వాహ నం నడుపుతూ సెల్‌ఫోన్‌ మాట్లాడడంపై, స్త్రీలను గౌరవిద్దాం సమాజా భివృద్ధికి తోడ్పడం, వరకట్నం, గృహ హింసా చట్టాలపై, మూఢ నమ్మకా లను వీడాలని, ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్న వారు జాగ్రతలు తీసుకోవాలని, అందరు, అన్ని మతాల వారు ఐకమత్యంగా ఉండాలని, ‘షీ’ టీంల ఆవశ్యకత, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రతలపై పోలీస్‌ కళాబృందాల ద్వారా జనాలకు అవగా హన కల్పించనున్నట్లు సీపీ కార్తికేయ ఒక ప్రకటనలో వెల్లడించారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...