గురుకుల పాఠశాలల్లో ఖాళీల భర్తీకి ప్రవేశపరీక్ష


Fri,May 17, 2019 02:52 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు బ్యాక్‌లాగ్‌ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించే రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయాధికారి సి.సింధు ఒక ప్రకటన లో తెలిపారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఈనెల 18 నుంచి 27 వరకు సమర్పించుకోవచ్చని, పరీక్ష ఫీజు కింద ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.100, ఇతరులైతే రూ. 200గా చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష జూన్‌ 9న ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు www.tswreis.in వెబ్‌సైట్‌ గానీ లేదా www.tsswreisic.cgg.gov.in వెబ్‌సైట్‌ను గానీ సందర్శించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

357
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...