కంపెనీ నిబంధనల మేరకే ఉత్తర్వుల జారీ


Fri,May 17, 2019 02:51 AM

ఖలీల్‌వాడి : టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ ఒక ప్రభు త్వ రంగ సంస్థ అని, విద్యుత్‌ ఉద్యోగులకు ఇచ్చే ఉత్తర్వులు కంపెనీ నియమ నిబంధనల మేరకు ఇవ్వ డం జరుగుతుందని టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ సుదర్శనం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌శాఖ ఆపరేషన్‌ సర్కిల్‌ నిజామాబాద్‌లోని ఎంఆర్టీ డివిజన్‌ విభజనలో భాగంగా, ఎంఆర్టీ డివిజన్‌లో పనిచేస్తున్న అందరు ఉద్యోగులు, కార్మిక ఉద్యోగ సంఘాలు, ద్వైపాక్షిక చర్చలు, అందరి నిర్ణ యం ప్రకారం కౌన్సెలింగ్‌ చేయడం జరుగుతుందన్నారు. కానీ ఎవరైతే కొందరు ఉద్యోగులు వారికి అనుకున్న ప్రకారం పోస్టింగ్‌ రావడం లేదో వారు భావోద్వేగాలకు లోనుకాకూడదన్నారు. ఈ నెల 15 వరకు రిపోస్టింగ్‌కు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వ డం లేదని తెలిపారు. ఉద్యోగులుందరికీ కౌన్సెలింగ్‌ జరిపి నిబంధనల ప్రకారం క్యాడర్‌, సీనియార్టీ ప్రకారం ఈనెల 16న ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...