ప్రశాంతంగా డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు


Fri,May 17, 2019 02:51 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని డిగ్రీ అనుబంధ కళాశాలల్లో డిగ్రీ కోర్సులకు సంబంధించిన రెండో, నాలుగో సెమిస్టర్లలో రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌, ఇంఫ్రూవ్‌మెంట్‌, ఆరో సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను సీబీసీఎస్‌ పద్ధతిలో సెలబస్‌ ప్రశ్నపత్రాలతో నిర్వహించారు. మొత్తం 33 పరీక్షా కేంద్రాలను మొదటిరోజు పరీక్షకు కేటాయించారు.

ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగిన పరీక్షల్లో ఉదయం మొత్తం 7,706 మంది విద్యార్థులకు గాను 7,461 మంది విద్యార్థులు హాజరై, 245 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలో మొత్తం 11,236 మంది విద్యార్థులకు గాను 10,754 విద్యార్థులు హాజరై 482 మంది విద్యార్హులు గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతమైన వాతావరణంలో డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయని, ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ వంటి చర్యలు జరగలేవని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ కె.సంపత్‌కుమార్‌ తెలిపారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...