ఆగస్టులో టీటీసీ ట్రైనింగ్‌ కోర్సు పరీక్ష


Fri,May 17, 2019 02:50 AM

ఇందూరు : టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ (లోయర్‌ గ్రేడ్‌) థియరీ పరీక్షలు జూలై లేదా ఆగస్టు మాసంలో నిర్వహించనున్నట్లు డీఈవో దుర్గాప్రసాద్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారన్నారు. అర్హత గల విద్యార్థులు ఈ ఐదు జిల్లాలో నలభై రెండు రోజుల పాటు శిక్షణ పొందుతున్న విద్యార్థులు, గత సంవత్సరం ఫెయిల్‌ అయిన విద్యార్థులు శిక్షణ పొందాలన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు రూ. 150, 29వ తేదీ వరకు రూ.50 అపరాధ రుసుముతో చెల్లించాలన్నారు. ఇతర వివరాలకు సంబంధిత డీఈవో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...