మేతకు లోటు లేకుండా..


Fri,May 17, 2019 02:47 AM

నిజామాబాద్‌ రూరల్‌: మూగజీవాలైన పాడిపశువులు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు పశుగ్రాసం(పచ్చి మేత) ఎంతగానో దోహదపడుతుంది. ఈనిన పాడి పశువులకు పచ్చిగడ్డి పుష్కలంగా అందించడంతో ఆరోగ్యవంతంగా ఉండడంతో పాటు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. దీంతో పాడి పెంపకందారులకు పాలదిగుబడి పెరిగి ఆర్థికంగా ప్రయోజనాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది.

అంతేగాకుండా పశుగ్రాసం పాడిపశువులకు పోషకాహారంగా పనిచేసి అవి బలంగా ఉండేందుకు దోహదపడుతాయి. రాష్ట్ర ప్రభుత్వం పశుగ్రాసం ప్రాధాన్యతను గుర్తించి పాడి పశువులు పెంపకం చేస్తున్న రైతులకు 50శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తూ ప్రోత్సహిస్తున్నది. పాడి పశువుల పెంపకంతో పాల ఉత్పత్తిదారులు పాలను విక్రయిస్తూ త్వరితగతిన ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటున్నందున, ఆ దిశగా ప్రభుత్వం తగినంత చేయూతనిస్తున్నది.

ఈ వేసవిలో ప్రత్యేక దృష్టి...
వేసవిలో పశుగ్రాసం(పచ్చిగడ్డి మేత) కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టింది. ఏప్రిల్‌లో జిల్లాకు 20 మెట్రిక్‌ టన్నుల గడ్డి విత్తనాలను సరఫరా చేసింది. ఈ విత్తనాలను పాడి పెంపకందారులకు 50శాతం సబ్సిడీపై పంపిణీ చేశారు. జిల్లాలోని పశు వైద్యశాలలకు గడ్డి విత్తనాల సంచులను చేర్చారు. అక్కడి నుండి పాడిరైతులు తమకు అవసరమున్న మేరకు గడ్డి విత్తనాలను సబ్సిడీపై కొనుగోలు చేసి తీసుకెళ్లి విత్తుకున్నారు. ఫలితంగా పశుగ్రాసం పెరిగి పశువుల మేతకు ఉపయోగపడుతున్నది. బోర్లు లేదా నీటి పరివాహక వసతి కలిగిన పాడి రైతులు.. తమకున్న భూమిలో అర ఎకరం వరకు గడ్డి విత్తనాలు విత్తి పశుగ్రాసం పెంచుతున్నారు.

3,365 మంది పాడి రైతులకు పంపిణీ...
పశుసంవర్ధక శాఖ అధికారులు ఎస్‌ఎస్‌జీ 898 జొన్న రకం గడ్డి విత్తనాలను పాడి రైతులకు సరఫరా చేశారు. ఏప్రిల్‌లో 20 మెట్రిక్‌ టన్నుల గడ్డి విత్తనాలను జిల్లాలోని పలు పశు వైద్యశాలలకు మినీ కిట్‌ బ్యాగ్‌లను డంపింగ్‌ చేశారు. 5కిలోల మినీ కిట్‌ బ్యాగ్‌ ధర రూ.150 ఉండగా.. 50శాతం సబ్సిడీ పోనూ రూ.75 చెల్లించి పాడి రైతులు కొనుగోలు చేశారు. జిల్లావ్యాప్తంగా 3,365 మంది పాడి రైతులు సబ్సిడీపై గడ్డి విత్తనాలను కొనుగోలు చేసి పశుగ్రాసం పెంచుతున్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...