మంజీరపై నాలుగు చెక్‌డ్యాములు


Thu,May 16, 2019 02:49 AM

బీర్కూర్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్‌, పొతంగల్‌, సుంకిని గ్రామాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు చెక్‌డ్యాంలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా బీర్కూర్‌ మంజీర నదిపై రూ.45 కోట్లతో చెక్‌డ్యాంలను నిర్మించనుండడంతో మంగళవారం ఈ పనులకు గాను ఇరిగేషన్‌ అధికారులు సర్వే చేపట్టారు. బీర్కూర్‌ మంజీర గడ్డ నుంచి కుర్లా మంజీర గట్టు వరకు 1300 మీటర్ల మేర ఈ చెక్‌ డ్యాం నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో రైతులకు ఎంతో మేలు జరగనున్నది. ఎండాకాలంలో బోర్లు ఎత్తిపోయి రైతులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవనున్నది. చెరువుల్లో నీరు ఇంకి పోకుండా, భూగర్భ జలాలు తగ్గకుండా ఈ చెక్‌డ్యాంలు ఎంతో సహకరించి నీటిని నిల్వ ఉంచి పశువులకు తాగేందుకు నీటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తాయని పాడి రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చెక్‌ డ్యాం నిర్మాణం వెనుక స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువ నాయకుడు పోచారం భాస్కర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్‌ కృషి ఎంతో ఉంది. ఈ నాలుగు చెక్‌ డ్యాంల నిర్మాణంతో కేవలం బాన్సువాడ నియోజకవర్గంలోని రైతాంగమే కాకుండా జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుంద, మద్నూర్‌ మండలాల రైతులు సైతం రాష్ట్ర శాసన సభాపతి పనితీరుపై హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ చెక్‌ డ్యాంల నిర్మాణంతో తమ ప్రాంతంలోని మోటారు బోర్లు కూడా నీటిని అధికంగా పోస్తాయని, అదేవిధంగా భూగర్భ జలాలు తమ ప్రాంతంలో పెరుగుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...