వందశాతం పన్ను వసూలే లక్ష్యం


Thu,May 16, 2019 02:48 AM

నిజామాబాద్‌ రూరల్‌ : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ ల్లో ఈ యేడు వందశాతం పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి నుంచే వసూళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ కార్యదర్శులకు ఆదేశించారు. నిజామాబాద్‌ రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మోపాల్‌, రూరల్‌ మండలాల్లోని పంచాయతీ కార్యదర్శులకు బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటి పన్నులు పూర్తిస్థాయిలో వసూలైతేనే గ్రామపంచాయతీకి తగిన ఆదాయం సమకూరుతుందని తద్వారా పంచాయతీ కార్యాలయ నిర్వహణతో పాటు ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించేందుకు అవకాశముంటుందన్నారు.

కొన్ని జీపీల్లో పన్నుల వసూళ్లు 20 నుంచి 30 శాతం మాత్రమే ఉందని దీన్ని ఈ యేడు వందశాతం వసూళ్ల కోసం ప్రతి కార్యదర్శి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. పన్నుల వసూళ్లపై ఆమె కార్యదర్శులతో నేరుగా సమీక్షించారు. ఇంటి పన్నులు వసూళ్లు తక్కువ కావడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. గుండారం గ్రామపంచాయతీ పరిధిలో రైల్వేట్రాక్‌ సమీపం లో నిర్మించిన గోదాంల పన్ను బకాయి రూ.7లక్షలు రావాల్సి ఉందని కార్యదర్శి గిరిధర్‌రెడ్డి తెలిపారు. ఇందుకు డీపీవో స్పందిస్తూ నోటీసు ఇచ్చిన అ నంతరం స్పందించకపోతే గో దాంను సీజ్‌ చేయాలని కార్యదర్శికి ఆదేశించా రు. మొండి బకాయిల వసూళ్ల కోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్పంచులు, వార్డు మెంబర్ల సహకారాన్ని తీసుకుని కార్యదర్శులు,కారోబార్లుపన్నులవసూళ్లపై దృష్టి సారించాలన్నారు. ఇంటి కుళాయి పన్నులను బాధ్యతగగుర్తించిస్వచ్ఛందంగా ముందుకొచ్చి చెల్లించేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...