భవన నిర్మాణాలు,లే అవుట్‌ అనుమతులు ఆన్‌లైన్‌లోనే ఇవ్వాలి..


Thu,May 16, 2019 02:47 AM

భవనాల నిర్మాణాలకు, వెంచర్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఇచ్చే లేఅవుట్‌ అనుమతులను పంచాయతీ కార్యదర్శులు ఆన్‌లైన్‌ ద్వారానే ఇవ్వాలని డీపీవో జయసుధ ఆదేశించారు. ఆన్‌లైన్‌ ద్వారా కాకుండా మ్యానువల్‌ ద్వారా అ నుమతులిచ్చినట్లయితే కార్యదర్శులు సస్పెండ్‌కు గురయ్యే పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. నాన్‌ లేఅవుట్‌ ప్లాట్లలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని సూచించారు. ఒకవేళ అలా ఇచ్చినట్లయితే పంచాయ తీ పాలకవర్గాన్నే రద్దు చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. గ్రామాల్లో కార్యదర్శులు సమయపాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. పారిశుధ్య నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేందుకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల పెంపకంపై శ్రద్ధ కనబర్చాలన్నారు.

ప్రతి జీపీలో వచ్చే కరెంట్‌ బిల్లును, విద్యుత్‌ వినియోగం వే బిల్లు ఎంత అనే వివరాలను రికార్డులో నమోదు చేయాలని సూచించారు. గ్రామంలో అన్ని శాఖల పనితీరుపై సంపూర్ణ అవగాహనతో పాటు సమగ్ర సమాచారంతో కార్యదర్శులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. ఇంటి పన్నుల ఫిక్సెషన్‌ చేసి డిమాండ్‌ జాబితాలను ఈవోపీఆర్డీలకు సమర్పించాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నా రు. బోర్లలో గ్రౌండ్‌వాటర్‌ తగ్గి తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వ్యవసాయ బోరును లీజుకు తీసుకుని ప్రజలకు తాగునీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉందన్నారు. మేజర్‌ సమస్యలు ఏవైనా ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమా వేశంలో ఎంపీడీవో సంజీవ్‌కుమార్‌, ఈవోపీఆర్డీ సుబ్రమ్మ ణ్యం, డీపీవో కార్యాలయ అధికారి రాజబాబు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...