నిజామాబాద్‌ ప్రభుత్వ దవాఖానలో అరుదైన ఆపరేషన్‌


Thu,May 16, 2019 02:45 AM

ఖలీల్‌వాడీ: జిల్లా ప్రభుత్వ దవాఖానలో అరుదైన క్యాన్సర్‌ ఆపరేషన్‌ను బుధవారం విజయవంతంగా పూర్తి చేశారు. పురుషుల్లో అరుదుగా వచ్చే రొమ్ము క్యాన్సర్‌కు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సర్జరీ హెచ్‌వోడీ డాక్టర్‌ సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ చేశారు. ఈ సందర్భంగా వైద్యుడు మాట్లాడుతూ.. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్‌ లక్షల్లో ఒకరికి వస్తుందని ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా గర్గుల్‌ గ్రామానికి చెందిన వెంకటయ్య (70) కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతుండగా వైద్య పరీక్షలు చేసి క్యాన్సర్‌ వ్యాధిగా గుర్తించామని తెలిపారు.

దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములుతో మాట్లాడి ఆయన అనుమతితో ఉదయం 10 గంటలకు ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశామన్నారు. జిల్లాలోనే మొట్టమొటదటిసారి క్యాన్సర్‌ ఆపరేషన్‌ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో లక్షలు ఖర్చు పెట్టినా నయంకాని వ్యాధిని పైసా ఖర్చు లెకుండా చికిత్స చేసినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌కు సుమారు రూ.5లక్షల ఖర్చు అవుతుందన్నారు. పేద ప్రజలను దృష్ట్టిలో పెట్టుకొని ఈ ఆపరేషన్లు ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికి 10 మందికి వివిధ రకాల క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు ఆపరేషన్‌ చేసినట్లు వివరించారు. వెంకటయ్యను రెండు వారాల అనంతరం హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కాన్సర్‌ దవాఖానకు రేడియో థెరపీ చికిత్స కోసం పంపిస్తామని తెలిపారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...