నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు


Thu,May 16, 2019 02:44 AM

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ సంపత్‌కుమార్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 33 సెంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో 12, నిజామాబాద్‌ జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 16వ తేదీన ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి, రెండో సెమిస్టర్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉంటాయని తెలిపారు.

17వ తేదీన నాల్గవ సెమిస్టర్‌ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆరవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు 7,689 మంది విద్యార్థులు, నాల్గవ సెమిస్టర్‌లో రెగ్యులర్‌ పరీక్షలకు 8,470 మంది, బ్యాక్‌లాగ్‌ 3,245 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. రెండో సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలకు 11,149 మంది విద్యార్థులు, బ్యాక్‌లాగ్‌ 5,803 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత కళాశాలలకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షలకు సకాలంలో హాజరు కావాలని సూచించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...