కొత్త మండలాల్లో హవా ఎవరిదో..


Thu,May 16, 2019 02:43 AM

ఇందూరు: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాలనా సౌలభ్యం కోసం జిల్లాలో 8 కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇందల్వాయి, మెండోరా, ముప్కాల్‌, ఏర్గట్ల, మోపాల్‌, రుద్రూర్‌, మోస్రా, చందూర్‌ మండలాల్లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్‌, పెద్దకొడప్‌గల్‌, బీబీపేట, రాజంపేట, రామారెడ్డి మండల్లాల్లో తొలిసారిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాను కొత్తగా ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లాలో కూడా తొలిసారిగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించారు. తొలిసారి మండలాలుగా ఏర్పడిన చోట ఎలాగైనా గెలిచి తీరాలని ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ పడ్డారు. జిల్లా విభజన అనంతరం నిజామాబాద్‌ జిల్లాలో 27, కామారెడ్డిలో 22 మండలాలు ఉన్నాయి.

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలోని డివిజన్లలో మూడు విడతల ఎన్నికలు ముగియగా.. ఆయా పార్టీల అభ్యర్థులు వారి వారి లెక్కలు వేసుకుంటున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ప్రాతినిధ్యం వహించాలని ఈసారి పోటీలో నిలిచారు. వారి భవిష్యత్తు ఈనెల 27న తేలనుంది. బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా, ముప్కాల్‌, ఏర్గట్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున రాష్ట్ర రోడ్లు,భవనాల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పార్టీనుంచి పోటీలో నిలిచిన వారికి అండగా నిలిచి వారి తరపున ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా కొత్త మండలాల్లో ఎలాగైనా గులాబీ జెండాను ఎగురవేయాలని శక్తివంచన లేకుండా కృషి చేశారు. మండలాలుగా విభజించడంతో తమకే కలిసొస్తుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈనెల 27న ఫలితాలు వెల్లడి కానుండడంతో అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...