భూసమస్యలు పరిష్కరిస్తాం


Thu,May 16, 2019 02:41 AM

ధర్పల్లి (సిరికొండ) : గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రత్యేకంగా ‘మీ భూమి - మీ పట్టాలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్‌ ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ‘మీ భూమి-మీ పట్టాలు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూ భూముల సమస్యలనేవి ఉండకూదన్న ఉన్నత లక్ష్యంతోనే ‘సమస్యలతో రండి.. పరిష్కారంతో వెళ్లండి’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.

ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తమకు అందిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా బాధిత రైతులకు ఆర్డీవో హామీ ఇచ్చారు. తహసీల్దార్‌, వీఆర్వోలు సరిగ్గా స్పందించకుంటే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తన దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటానని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తానని ఆర్డీవో ఈ సందర్భంగా రైతులకు భరోసా కల్పించారు. భూములకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే రైతులు లిఖిత పూర్వకంగా స్థానిక వీఆర్వోలు, తహసీల్‌ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వచ్చిన వినతులను విచారణ చేపట్టి పరిష్కరిస్తామని ఆర్డీవో అన్నారు. రైతులు ‘మీ భూమి - మీ పట్టాలు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అంజయ్య, డీటీ, ఆర్‌ఐ, వీఆర్వోలు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...